Sunday, July 13, 2025
Homeవైరల్Teku Fish: ఇదేందిరా ఇంత పెద్దగా ఉంది.. ఇలాంటి వెరైటీ ఫిష్ ను నేనెప్పుడు చూడలే..!

Teku Fish: ఇదేందిరా ఇంత పెద్దగా ఉంది.. ఇలాంటి వెరైటీ ఫిష్ ను నేనెప్పుడు చూడలే..!

Huge teku fish: మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లనిదే పూట గడవదు. వేటకు వెళ్తే ఎప్పుడూ తిరిగి వస్తారో తెలీదు. వాళ్ల వచ్చే వరకు ఇంట్లో వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ప్రాణాలను రిస్క్ చేసి మరి చేపలు పడతారు జాలర్లు. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద చేపలు పడితే..మరికొన్ని సార్లు వాళ్లు వట్టి చేతులతోనే ఇంటికి తిరిగొస్తారు. ఈ చేపల వేటలో కొన్ని చేపలు మత్స్యకారుడు తలరాతనే మార్చేస్తాయి. అరుదైన చేపలు పడి లక్షాదికారులైన వారు టీవీల్లోనూ, పేపర్లోనో లేదా మెుబైల్స్ లోనూ చాలా మందినే మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంటారు.

- Advertisement -

సాధారణంగా చేపలు తినడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని చేపలను మాత్రం మెడిసన్ లో కూడా వాడతారు. ఇలాంటి చేపలకు బయట మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. లక్షలిచ్చైనా కొనుగోలు చేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే యానాంలో జరిగింది. మత్సకారులకు గోదావరిలో వలకు భారీ టేకు చేప చిక్కింది. పడవలో వేటకు వెళ్లిన పొన్నమండ భీమరాజు బృందానికి జీఎంసీ బాలయోగి వారధి సమీపంలో 160 కిలోల బరువు, ఎనిమిది అడుగుల పొడవైన టేకు చేప వలలో పడింది. జాలర్లు ఈ భారీ చేపను అతి కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు.

ఈ చేపలు ఎక్కువగా సముద్రంలో కనబడుతుంటాయి. అలాంటి ఈ చేప నదిలో దొరకడం మత్స్యకారులను షాక్ కు గురిచేసింది. ఈ టేకు చేప భైరవపాలెం మొగ ద్వారా గౌతమి గోదావరిలోకి వచ్చి ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపను వేలంకు పెట్టగా రూ.17వేలకు దక్కించుకున్నారు. దీంతో ఆ మత్స్యకారులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News