Bittu Tabahi: సోషల్ మీడియాతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. కొంతమంది సెలబ్రెటీలను మించి ఫాలోయింగ్ సంపాదిస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. చిన్న వయస్సులోనే తమ కంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఒక్క పిలుపుతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే బిట్టూ తబాహి. ఈ 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు పిలుపిస్తే చాలు జనాలు క్యూ కట్టి మరీ నదుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం అంతా క్లీన్ చేసేందుకు అతనితో చేయి కలుపుతున్నారు. నదులను గంటల వ్యవధిలోనే క్లీన్ చేసి, వైరల్ అవుతున్న బిట్టూను ఏకంగా 1.9 మిలియన్ల మంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారంటే అతని క్రేజ్ ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు.
https://www.instagram.com/p/DcvPKXYDvGs/?stkn=MWRmdWYxbXp3cnh1cg%3D%3D
పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛంద సేవలో..
బిట్టూ పిలుపు ఇవ్వగానే స్థానికులు మొదలు కార్పొరేట్ ఉద్యోగుల వరకు అన్ని వయసులవారు వచ్చి, నదులను శుభ్రం చేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటుండం విశేషం. స్వచ్ఛ భారత్, జన్మభూమి ఏమోగానీ బిట్టూ మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తనపని నదులు శుభ్రం చేసి, ప్రజలకు అవగాహన కల్పించటమే అంటూ దూసుకుపోతున్నాడు. నెలల తరబడి, కోట్ల రూపాయలు వెచ్చించినా శుభ్రం కాని నదులు కేవలం కొన్నంటే కొన్ని గంటల్లోనే క్లీన్ అయిపోవటం అదికూడా పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛంద సేవలో భాగంగా ఇవన్నీ శుభ్రమైపోతున్నాయంటే యువత శక్తి ఎంత బలంగా ఉంటుందన్నదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.
https://www.instagram.com/p/DazzTHPkrrf/?stkn=NGFrOXZtb3drMmQ2

