Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: వామ్మో బుడ్డోడు ఇలా ఉన్నాడేంట్రా.. రెండు చేతుల్లో పాములు పట్టుకుని హల్చల్

Viral Video: వామ్మో బుడ్డోడు ఇలా ఉన్నాడేంట్రా.. రెండు చేతుల్లో పాములు పట్టుకుని హల్చల్

Viral Video: పామును చూస్తే ఎంత లావటి మనిషికైనా ఓ పక్క వణుకుతుంది. అక్కడ పాము ఉందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. మరికొంత మంది మాత్రం పాములను నైపుణ్యంతో చాలా చాకచక్యంగా పట్టుకుంటారు. వాటి తోక పట్టుకుని ఆడిస్తారు. పెద్దవారైతే ఓకే గాని ఇక్కడో బుడతడు కూడా పామును పట్టుకున్న విధానం చేసి నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి భయం లేకుండా తన చేతులతో పామును పట్టుకోవడం కనిపిస్తుంది. ఈ వైరల్ క్లిప్ గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ ప్రారంభమైంది. కొంతమంది ఆ చిన్నోడి ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, చాలా మంది నెటిజన్లు ఆ బాబు తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంటి ఆవరణలో కి వచ్చిన రెండు పాములను ఓ పిల్లాడు రెండు చేతులతో పట్టుకోవడాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

- Advertisement -

Read Also: Bigg Boss Nominations: సంజనాకు స్పెషల్ పవర్.. సుమన్ శెట్టి బలి..నామినేషన్ ఫుల్ లిస్ట్ చూసేయండి

సోషల్ మీడియాలో వైరల్ గా..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక చిన్నారి బాలుడు తన ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చుని ఉండటం కనిపిస్తుంది.. అంతలోనే ఎట్నుంచి వచ్చాయో తెలియదు గానీ, రెండు పాములు స్పీడ్‌గా పాకుతూ అటుగా వస్తాయి. వాటిని, ఆ బుడ్డొడు భయంతో పారిపోతాడు అనుకుంటే.. అందుకు విరుద్ధంగా ఆ పాములను పట్టుకుని ఆటడాతున్నాడు. ఈ షాకింగ్‌ వీడియో ప్రతిఒక్కరినీ భయపెడుతోంది. చిన్నపిల్లాడు ఇలా పాములతో ఆడుకోవటం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. రెండు పాముల తోకలు పట్టుకున్న చిన్నోడు వాటిని అటు, ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. అయినా, ఆ పాములు మత్రం బుసలుకొట్టకుండా వాడి చేతిలో ఆటబొమ్మలుగా కదులుతున్నాయి. ఇలా ఆ పిల్లాడు చాలా సేపు ఆ పాములతో ఆడుకోవటం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 42 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో వీడియో దూసుకుపోతోంది.

Read Also: Pakistan Team Reached for Practice:  పరువుపోగొట్టుకున్న పాక్.. యూఏఈతో మ్యాచ్ కి రెడీ

ఇలాంటిదే మరో వీడియో

అంతేకాకుండా, ఇటీవలే ఇలాంటి మరో వీడియో వైరల్ గా మారింది. ఆ 33 సెకన్ల వీడియోలో ఆ పిల్లవాడు మొదట పామును పట్టుకునే సాధనంతో దాని తలను నొక్కి, ఆపై త్వరగా పాము నోటిని పట్టుకుని దాన్ని పైకి లేపడం చూడవచ్చు. వీడియోలో ఈ పిల్లవాడు పామును ఓ బొమ్మలాగా పట్టుకోవడం ఉంది. దీని తర్వాత పాము తన చేతిలో ఇబ్బంది పడుతుండగా అతను నవ్వుతూనే ఉన్నాడు. ఆ పిల్లవాడు పాము నోటిని గట్టిగా నొక్కినందున అది ఏమీ చేయలేకపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు దీనిని ‘రీల్’ చేయడానికి చేసిన నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. అయితే, పాము విషపూరితమైనదా కాదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ ఇంత చిన్న వయస్సులో ఇంత రిస్క్ తీసుకోవడం ప్రాణాంతకం అని నెటిజన్స్‌ అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad