Sunday, February 8, 2026
Homeవైరల్Heartwarming Video: అలల స్పర్శతో చెల్లి కళ్లలో ఆనందం.. వైరల్ అవుతున్న వీడియో..

Heartwarming Video: అలల స్పర్శతో చెల్లి కళ్లలో ఆనందం.. వైరల్ అవుతున్న వీడియో..

Brother Sister Bonding video: లోకంలో అన్నాచెల్లెలు అనుబంధం ఎంతో స్వచ్ఛమైనది, అపురూపమైనది. ఎలాంటి స్వార్థం లేకుండా, కేవలం ప్రేమానురాగాలతో నిండింది ఈ బంధం. అలాంటి అద్భుతమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఒక దృశ్యం ఇప్పుడు ఎంతో మంది హృదయాలను తాకుతోంది.

- Advertisement -

ఒక అన్నయ్య, తన నడవలేని చెల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఎంతో దూరం తీసుకువెళ్లాడు. అలల సవ్వడులు వినిపించే సముద్ర తీరం వరకు ఆ వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ వెళ్లాడు. ఆమె పాదాలను కెరటాలు తాకేంత దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ క్షణం.. ఆమె ముఖంలో విరిసిన ఆనందం వర్ణనాతీతం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శారీరక లోపంతో నడవలేని ఆ చెల్లికి సముద్రపు అలల స్పర్శ ఒక గొప్ప కల. ఆ కలను నిజం చేయడానికి ఆ అన్నయ్య ఎంత శ్రమ పడ్డాడో ఆ క్షణం ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం చెప్పకనే చెప్పింది. అలలు ఆమె పాదాలను తాకగానే, ఆమె కళ్ళలో మెరిసిన కాంతి, పెదవులపై విరిసిన చిరునవ్వు.. ఆ అన్నయ్య పడిన శ్రమకు సార్థకతను తెచ్చింది. నిస్వార్థమైన ప్రేమకు, పరాకాష్టమైన ఆప్యాయతకు ఇది ఒక నిదర్శనం. జీవితంలో సాధారణంగా కనిపించే కొన్ని పనులు, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు మనసును ఎంతగానో కదిలిస్తాయి. ఈ దృశ్యం అలాంటిదే. అన్నచెల్లెళ్ల బంధంలోని స్వచ్ఛతను, ప్రేమను ఇది మరోసారి మనందరికీ గుర్తు చేసింది.

Also Read: Viral Video -ఇంట్లో బోర్ వేస్తుంటే.. పక్క ఇంట్లో భూమిని చీల్చుకుంటూ ఉప్పొంగిన జలధార!

ఈ వీడియాను ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. వేలాది లైక్స్, కామెంట్స్ వచ్చాయి. సోదరసోదరీమణులు స్వచ్ఛమైన ప్రేమకు ఇది నిదర్శనంగా నెటిజన్స్ భావిస్తున్నారు. చెల్లెలు ఆనందం కోసం అన్నయ్య చేసిన ప్రయత్నానికి యూజర్స్ సెల్యూట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News