Saturday, November 15, 2025
HomeTop StoriesViral Video: బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.. బీటెక్‌ విద్యార్థి స్పాట్‌ డెడ్‌.!

Viral Video: బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.. బీటెక్‌ విద్యార్థి స్పాట్‌ డెడ్‌.!

Bike Stunt Viral Video: రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని ట్రాఫిక్‌ పోలీసులు, ఆయా ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరిలో తీరు మాత్రం మారడం లేదు. హెల్మెట్‌ ధరించకుండా, హై స్పీడ్‌తో విచ్చలవిడిగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిర్దేశిత రోడ్లపై మాత్రమే చేయాల్సిన స్టంట్లను పబ్లిక్‌ రోడ్లపై చేస్తూ మరణాన్ని ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి బైక్‌ స్టంట్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటుచేసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/man-harasses-girl-her-friends-fake-robbery-for-mobile/

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బైక్‌ స్టంట్స్‌ చేస్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. నాగ్‌చాలాకు చెందిన 22 ఏళ్ల అనికేత్‌ బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో ఫేమస్‌ అయిన అనికేత్‌.. శనివారం అర్ధరాత్రి రీల్‌ చేసేందుకు యత్నించాడు. కిర్తాపూర్-మనాలీ నాలుగు లేన్ల రహదారిలోని మలోరి టన్నెల్ సమీపంలో బైక్‌పై స్టంట్‌ చేస్తుండగా.. అది బెడిసికొట్టింది. 

బైక్‌పై నియంత్రణ కోల్పోయిన అనికేత్‌ కిందపడ్డాడు. టన్నెల్‌ మలుపు వద్ద రోడ్డుపై బైక్‌ జారడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఘటనలో అనికేత్‌ మెడ విరిగిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అనికేత్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ప్రమాదకర స్టంట్‌కు ప్రయత్నించమని అనికేత్‌ను ప్రేరేపించిన వీడియోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో అతడిని నిందితుడిగా పేర్కొంటూ.. మొబైల్ ఫోన్‌లు, కెమెరా ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/salman-khan-declared-terrorist-by-pakistan/

ఈ స్టంట్‌కు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వైరల్‌ వీడియోను చూసి నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై డ్రైవింగ్‌ చేసేటప్పుడు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ సేఫ్‌గా ఇంటికి చేరుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad