Homeవైరల్Carry Men Trend: షాపింగ్‌కు కొత్త ట్రెండ్.. ‘క్యారీ మెన్’ సేవలు వైరల్!

Carry Men Trend: షాపింగ్‌కు కొత్త ట్రెండ్.. ‘క్యారీ మెన్’ సేవలు వైరల్!

Carry Men Trend: షాపింగ్ అంటే ఇష్టమే కానీ గంటల తరబడి బ్యాగులు మోసుకోవడం మాత్రం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీలో ఓ వినూత్న స్టార్టప్ ‘క్యారీ మెన్’ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, వ్యాపార పరంగా కూడా మంచి ఆదరణ పొందుతోంది.

- Advertisement -

యూ షాప్.. వి క్యారీ
‘యూ షాప్.. వి క్యారీ’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ సేవలో, షాపింగ్‌కు వెళ్లిన వారికి బ్యాగులు మోసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులను అందుబాటులో ఉంచుతున్నారు. భర్త, బాయ్‌ఫ్రెండ్ లేదా కుటుంబ సభ్యులు తోడుగా రాని సందర్భాల్లో షాపర్లకు సహాయకులుగా ఈ ‘క్యారీ మెన్’ పనిచేస్తారు. షాపింగ్ బ్యాగులు మోసుకోవడం మాత్రమే కాకుండా, ఎండ లేదా వర్షం నుంచి రక్షణగా గొడుగు పట్టడం, చిన్నారులను ట్రాలీలో తీసుకెళ్లడం, అవసరమైతే స్నాక్స్ బ్రేక్ కోసం సహాయం చేయడం వంటి సేవలను కూడా అందిస్తున్నారు.

Also Read: Terrarist Attack: అనంతనాగ్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు కానిస్టేబుల్‌ మృతి

గంటకు రూ.149
ఈ సేవల కోసం గంటకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 2, 3 లేదా 4 గంటల ప్రత్యేక ప్యాకేజీలను కూడా వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో క్యారీ మెన్ గరిష్టంగా 12 కిలోల వరకు బరువును మోసేలా శిక్షణ పొందారు. షాపింగ్ పూర్తయ్యే వరకు వినియోగదారులతో పాటు ఉండి, పార్కింగ్ ప్రాంతం లేదా సమీప మెట్రో స్టేషన్ వరకు కూడా తోడుగా వెళ్తారు. ప్రత్యేకంగా వృద్ధులు, గర్భిణీలు, ఎక్కువసేపు షాపింగ్ చేసే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. వినూత్న ఆలోచనతో ప్రారంభమైన ఈ స్టార్టప్‌కు ఢిల్లీలో విశేష స్పందన లభిస్తుండగా, త్వరలోనే దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలకు కూడా సేవలను విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News