Friday, January 16, 2026
Homeవైరల్Viral: గేటు బయటే కాదు.. లోపలా నో సేఫ్టీ.. లిఫ్ట్‌లో హెల్మెట్‌తో వచ్చి చైన్‌ స్నాచింగ్‌.....

Viral: గేటు బయటే కాదు.. లోపలా నో సేఫ్టీ.. లిఫ్ట్‌లో హెల్మెట్‌తో వచ్చి చైన్‌ స్నాచింగ్‌.. వీడియో.!

Chain Snatching video: బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ చైన్‌ స్నాచింగ్‌ ఘటనలూ పెరుగుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమరపాటుగా ఉన్నామంటే క్షణాల్లో లక్షల ఖరీదు చేసే బంగారం కళ్లముందే మాయమవుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలనూ లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక, 24 గంటలూ సెక్యూరిటీ ఉండే అపార్ట్‌మెంట్‌ల్లోనూ గొలుసు చోరీలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

అపార్ట్‌మెంట్స్ అంటే గేటు బయట ఇద్దరు సెక్యూరిటీని కచ్చితంగా ఊహించుకుంటాం. బయటి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ఎంట్రీ, ఎగ్జిట్‌ కచ్చితంగా సంతకం చేసి వెళ్లాల్సిందే. అందుకే ఉద్యోగాలు చేసే వాళ్లు, సెక్యూరిటీ కోరుకునే వారు.. ఇండిపెండెంట్‌ ఇళ్ల కంటే అపార్ట్‌మెంట్లకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ కూడా దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ దొంగ లిఫ్ట్‌లో చోరీకి యత్నించిన సంఘటన వైరల్‌ అవుతోంది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/court-green-signal-for-thalapathy-vijay-jana-nayagan-as-madras-hc-orders-cbfc-action/

ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని లా రెసిడెన్సియా సొసైటీ సమీపంలో ఓ ఎత్తైన భవనంలో చోరీ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భద్రత పట్ల అపార్ట్‌మెంట్‌ నివాసితుల్లో ఆందోళన కలిగిస్తోంది. చోరీకి సంబంధించి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

ఓ మహిళ తన కూతురితో కలిసి లిఫ్ట్‌లోకి వెళ్లగా.. ఆ వెనకాలే హెల్మెట్‌ ధరించిన ఓ వ్యక్తి అదే లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. వెంటనే మహిళ మెడలోని బంగారు గొలుసు లాగేందుకు యత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తేరుకున్న మహిళ.. వెంటనే బయటకు వచ్చి కుటుబీకులకు విషయం తెలియజేసింది. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, సొసైటీలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో భద్రత కరువైందని అపార్ట్‌మెంట్‌ వాసులు ఆరోపిస్తున్నారు. మెయింటెనెన్స్‌ కోసం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని.. కానీ తమకు భద్రత మాత్రం కల్పించడం లేదని మండిపడుతున్నారు. 

Also Read: https://teluguprabha.net/national-news/blinkit-delivery-boy-saves-woman-life-midnight-order/

స్వీయ రక్షణ అవసరం..

బంగారం ధరలు ఆకాశానికి చేరుతున్న క్రమంలో మహిళలు తమ వద్ద ఉన్న గోల్డ్‌ను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్తున్న సమయాల్లో ఒంటరిగా కాకుండా తోడుతో వెళ్లడం చాలా అవసరం. ముఖ్యంగా మెడ చుట్టూ చున్నీ లేదా స్కార్ఫ్‌ లాంటివి కప్పుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో ఎక్కువ బంగారం ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రంగా దాచుకోవాలని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News