Chikiri Chikiri Song Police Viral Step: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌తో.. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇటీవల విడుదలైన చికిరి.. చికిరి సాంగ్‌తో అంచనాలు మరింతగా రెట్టింపయ్యాయి. ఇక ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తుంది. ఈ సాంగ్ ఇప్పటికే తెలుగు వెర్షన్‌లో 10 రోజుల్లో 51 మిలియన్ వ్యూస్‌ని సంపాదించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
Also Read: https://teluguprabha.net/business/flipkart-bumper-offers-on-geysers-on-this-winter-season/
#ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥
Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃
🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is
— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025
తాజాగా పోలీసులు ప్రాక్టీస్ చేస్తుండగా పెరేడ్ గ్రౌండ్‌లో ‘చికిరి..చికిరి’ హుక్ స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మూవీ టీమ్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, పాట కొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ పాటపై రీల్స్ హుషారెత్తిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా విడుదల కాబోతుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు.
ఇక అన్ని భాషల్లో కలిపి చికిరి.. చికిరి సాంగ్ యూట్యూబ్‌లో 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో తిరుగులేని రికార్డు దిశగా కొనసాగుతోంది. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ రిలీజ్ కానుంది.
CHIKIRI’s momentum is scaling new heights! 🔥🔥🔥#ChikiriChikiri continues its stellar domination across platforms.
🔗 https://t.co/l1dAnuhT86#PEDDI — WORLDWIDE PREMIERE ON 27 MARCH 2026. pic.twitter.com/1cPFo4ojSi
— PEDDI (@PeddiMovieOffl) November 16, 2025


