Viral Video Chikni Chameli Insta Video: కాలేజీ రోజులు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. పెద్ద చదువులు, కొత్త స్నేహాలు.. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకాలు. ఇక ఫ్రెషర్స్ డే, ఫేర్‌వెల్ డే, ట్రెడిషనల్ డే.. ఇలా కాలేజీలో జరిగే విభిన్న రకాల ఈవెంట్లు విద్యార్థులను మరింత ఉత్సాహపరుస్తాయి. ఇక అమ్మాయిలు, అబ్బాయిలు.. జోష్ ఉన్న పాటలకి స్టెప్స్ విరగదీస్తుంటారు. ఇటీవల ఓ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఓ సూపర్ హిట్ పాటకి డాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
గౌహతికి చెందిన ఆశ్రిత అనే యువతి.. తాను చదువుకుంటున్న కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ చిక్నీ చమేలీ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఆమె డాన్స్ చేస్తున్నంత సేపు తోటి విద్యార్థులు ఉర్రూతలూగిపోయారు. అయితే ఇక్కడే ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆశ్రిత డాన్స్ చేస్తుండగా మధ్యలో సడెన్‌గా చీర కుచ్చులు వదులయ్యాయి. అక్కడే తను సమయస్ఫూర్తి ప్రదర్శిస్తుంది.
Also Read: https://teluguprabha.net/viral/plane-crashes-at-paramillo-airport-viral-video/
చీర కుచ్చులు వదులై జారిపోయే పరిస్థితి వస్తున్నా ఆశ్రిత వెనుకడుగు వేయలేదు. చాలా చాకచక్యంగా చీరను హ్యాండిల్ చేస్తూ హుషారైన స్టెప్పులతో అదరగొట్టింది. ఈ వీడియోను ఆశ్రిత తన ఇన్‌స్టాలో ఖాతాలో షేర్ చేసింది. ‘నా చీర వదులు కావచ్చు. కానీ నా ఎనర్జీ మాత్రం తగ్గలేదు.’ అని క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 25 లక్షల మందికి పైగా వీక్షించారు. 10వేలకు పైగా లైక్ చేశారు. సూపర్, ఫైర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.


