Sunday, November 16, 2025
Homeవైరల్Weight loss bonus: చైనా కంపెనీ వినూత్న ఆలోచన.. బరువు తగ్గితే బోనస్..!

Weight loss bonus: చైనా కంపెనీ వినూత్న ఆలోచన.. బరువు తగ్గితే బోనస్..!

Weight loss bonus: చైనా కంపెనీలు వినూత్న ప్రోత్సహకాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాయి. అయితే, మెరుగైన పనితీరు కనబరిస్తేనో, కంపెనీ మంచి లాభాలు సాధిస్తేనే బోనస్‌ ఇవ్వడం సహజం. కానీ, చైనాకు చెందిన ఓ కంపెనీ కాస్త వినూత్న ఆలోచన చేసింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయడం కోసం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. బరువు తగ్గిస్తే బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. మరి ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారా? అంటే ఔనని చెప్పొచ్చు. చైనాలోని ఇన్‌స్టా 360గా పేరొందిన అరాషి విజన్‌ సంస్థ వెయిట్‌లాస్‌ ఛాలెంజ్‌ ఇటీవల ప్రారంభించింది. ఇందుకోసం సుమారు రూ.1.1 కోట్ల నిధులను అలాట్ చేసింది. అయితే, ఈ ఛాలెంజ్‌లో ఒక వ్యక్తి తగ్గే ప్రతి అరకిలోకు దాదాపు రూ.5,800 బహుమతిగా ఇస్తారు. అలా ఈ ఏడాది జెన్‌జీ ఉద్యోగి షీయాకీ 90 రోజుల్లోనే 20 కిలోలు తగ్గి దాదాపు రూ.2.5 లక్షలు సంపాదించింది. దీంతో ఆమెకు ‘వెయిట్‌లాస్‌ ఛాంపియన్‌’ టైటిల్‌ దక్కింది. బరువు తగ్గేందుకు ఆహారాన్ని నియంత్రించానని, రోజూ గంటన్నర వ్యాయామం చేశానని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Read Also: BCCI: అరటిపండ్లకు రూ.35 లక్షలా? బీసీసీఐకి హైకోర్టు నోటీసులు..!
వర్క్ లైఫ్ తో..
ఈ ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా చేయడం, వర్క్‌లైఫ్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆరాషి విజన్ సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే ఇందులో ఓ స్పెషల్ రూల్ కూడా ఉంది. అయితే, ఎవరైనా మళ్లీ బరువు పెరిగితే ప్రతి 0.5 కిలోలకు దాదాపు రూ.9,300 జరిమానా కట్టాలి. ఇప్పటివరకు ఎవరికీ జరిమానా పడలేదని కంపెనీ తెలిపింది. అయితే, ఈ కార్యక్రమంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు మంచి ఆలోచన అని కొందరు ప్రశంసిస్తుండగా.. బరువు పెరిగితే జరిమానా విధించడం నైతికంగా సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు.

Read Also: Supreme Court: నేపాల్‌లో పరిస్థితి గమనించండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad