Viral: కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ సంస్కృతిపై విదేశీయులు కూడా మక్కువ చూపిస్తున్నారు. ఇటీవల చైనాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి భరతనాట్యం ప్రదర్శనే అందుకు నిదర్శనం. ఆ యువతి చేసిన భరతనాట్యం ప్రపంచవ్యాప్తంగా సంచలన సృష్టించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఆ వీడియోలో కనిపిస్తున్న చైనీస్ అమ్మాయి పేరు జాంగ్ జియాయువాన్, ఆమెను రియా అని కూడా ముద్దుగా పిలుస్తారు . జాంగ్ ఇటీవల బీజింగ్‌లోని ఒక హాలులో తన మొదటి పెద్ద ప్రదర్శన ‘అరంగేట్రం’ ఇచ్చింది. జాంగ్ మూమెంట్స్, వ్యక్తీకరణలు, ఆమె శైలిని చూసి భారతీయులు కూడా ఆశ్చర్యపోయారు. జాంగ్ ఐదు సంవత్సరాల వయసులోనే భరతనాట్యం నృత్యం చేయడం ప్రారంభించింది. 12 సంవత్సరాల వయసులో ఆమె ప్రసిద్ధ చైనీస్ భరతనాట్య నృత్యకారిణి జిన్ షాన్ షాన్ నుండి శిక్షణ పొందింది.
Read Also: Asia Cup: గేమ్ ఛేంజర్లు వారే.. ముగ్గురు క్రికెటర్లపై సెహ్వాగ్ ప్రశంసలు
చైనాలో భరతనాట్యం క్రేజ్
భరతనాట్యం కేవలం మన దేశానికే పరిమితం కాదు. పొరుగు దేశమైన చైనాలో కూడా దాని క్రేజ్ వేగంగా పెరుగుతోందని జాంగ్ ప్రదర్శన చూపించింది. గతేడాది 13 ఏళ్ల మరో బాలిక లీ ముజి భరతనాట్యం వైరల్ గా మారింది. చైనాలో భరతనాట్యం నేర్చుకుంటున్న మొదటి నర్తకిగా నిలిచింది. ఈ ట్రెండ్‌ను చైనాలో ప్రముఖ నృత్యకారుడు జాంగ్ జున్ ప్రారంభించారు . ఆయన భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి నృత్యాలను నేర్చుకుని చైనాలో వాటిని ప్రాచుర్యం పొందేలా చేశారు. ఆయన కృషి, నేటి నృత్యకారుల అభిరుచి చైనాలో కూడా భారతీయ సంస్కృతికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
📍Video of the Day 💖
A 17-year-old Chinese student wowed everyone with her solo 'Bharatanatyam dance' in Beijing, China. pic.twitter.com/XgGgymGjei
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 25, 2025
Read Also: Kerala: దుబాయ్ వీధుల్లో లగ్జరీ కారుతో 72 ఏళ్ల మహిళ చక్కర్లు.. వైరల్ గా వీడియో


