Cloth Merchant Viral Video: మంచి నీళ్లు తాగుదామని వాటర్ బాటిల్ తీసుకున్న వ్యక్తి క్షణాల్లోనే మూడో అంతస్తు నుంచి కింద పడి గాయాల పాలైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనకుండా ఉండలేరు.
#राजस्थान..#जोधपुर में एक कपड़ा व्यापारी बालकनी में कपड़े के बंडल चेक करते समय 3 मंजिला से अचानक नीचे गिर गया..घटना CCTV में कैद हुई..#rajasthan pic.twitter.com/BlYb1B0vA0
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) September 15, 2025
ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. దాహం తీర్చుకుందామనుకున్న కాసేపటికే ఊహించని ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ బట్టల వ్యాపారవేత్త.. మూడో అంతస్తులోని షాపు బయట నిలబడి ఉంటాడు. మంచి నీళ్లు తాగుదామని వాటర్ బాటిల్ అందుకుని పక్కనే ఉన్న పిట్టగోడపై కూర్చోవడానికి యత్నిస్తాడు. అంతలోనే అదుపు తప్పి ఒక్కసారిగా మూడో అంతస్తు నుంచి కిందపడిపోతాడు.
Also Read: https://teluguprabha.net/viral/son-fulfills-mothers-dream-skydiving/
ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో వైరల్‌గా మారింది. వ్యక్తి కిందపడిపోవడాన్ని గమనించిన షాపు సిబ్బంది, అక్కడున్న వారు వెంటనే బయటకు వచ్చి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబర్ 9 న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.


