couple romance on running bike: ఇటీవల కాలంలో లవర్స్, కపుల్స్ పబ్లిక్ ప్రదేశాల్లో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బైక్స్, బస్సులు, రైల్వేలు, మెట్రోలు..ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ కు దిగుతున్నారు. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి జంటే ఒకటి రోడ్డుపై రన్నింగ్ బైక్స్ పై పాడుపనులకు పాల్పడుతూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ భార్యభర్త బండి మీద వెళ్తూంటారు. ఇంతలో భార్యకు మూడ్ వచ్చిందో ఏమో కానీ బండి ట్యాంక్ పై కూర్చుని భర్తను రెచ్చగొట్టింది. దీంతో అతడు కూడా రెచ్చిపోయి బైక్ ను పోనిచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు హాగ్ చేసుకుని పబ్లిక్ బరితెగించి ప్రవర్తించారు. నాలుగు గోడల మధ్యన చేయాల్సిన పనులను రోడ్డుపై చేయడాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ మెుత్తం యవ్వారాన్ని అక్కడున్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
రోడ్డుపై చిన్నపిల్లలు ఉన్నారనే కామన్సెన్స్ లేకుండా వారు ప్రవర్తించారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఏకీపారేస్తున్నారు. కొంత మంది వీరికి పనిపాట లేదంటూ కామెంట్ పెడుతున్నారు. ఇలా పబ్లిక్ లో బరితెగించి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారని మరొక యూజర్ అంటున్నారు. ఇలాంటి వాళ్లన్నీ ట్రాఫిక్ పోలీసులు రెండు పీకి బొక్కలో వేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
Also read: Snake video: మిక్సీలో డేంజరస్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో.. – Telugu Prabha Telugu Daily


