Cow attacked kanpur: ఒక్కోసారి మూగజీవాలు పగబట్టినట్లు వెంబడిస్తాయి. ఉన్నట్లుంది అకస్మాత్తుగా దాడి చేస్తాయి. ఈ దాడిలో ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై ఆవు దాడి చేసిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని ఓ వీధిలో వృద్ధుడిపై ఒక ఆవు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సదరు వీడియో వైరల్‌గా మారింది. ఆవు దాడి తీరును చూస్తే అది పగబట్టినట్లే ఉందని వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
सोशल मीडिया पर वायरल वीडियो कानपुर के कल्याणपुर का है. यहां एक बुजुर्ग को गाय ने काफी देर तक बेरहमी से रौंदा. वहां मौजूद लोगों ने बड़ी मशक्कत के बाद बुजुर्ग की जान बचाई. pic.twitter.com/GhZSpn9VMj
— Abhishek Kumar (@pixelsabhi) September 19, 2025
కొమ్ములతో పొడచి.. చాలా దూరం ఈడ్చుకెళ్లి..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరానికి సమీపంలోని కళ్యాణ్‌పూర్‌లో ఒక వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక ఆవు ఒక్కసారిగా అతన్ని ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టి కొంత దూరం వరకు అతడిని ఈడ్చుకెళ్లి పడేసింది. దీంతో, అక్కడే రోడ్డు పక్కన బురదలో ఆ వృద్ధుడు పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఆవు అతనిపై పదే పదే దాడి చేసి చాలా సేపు తొక్కింది. ఆ సమయంలో వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ ఆవు శాంతించలేదు. ఆ వృద్ధుడిపై పగ బట్టినట్లు దాడి చేస్తూనే ఉంది. అటువైపుగా వెళ్తున్నవారు కేకలు వేస్తూ ఆవును భయపెట్టడానికి ప్రయత్నించారు. కొందరు కర్రలు, రాళ్లు తీసుకుని ఆవును బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఆవు కొంచె కూడా బెదరకుండా వృద్ధుడిని కాళ్లతో తొక్కి పడేసింది. ఏదో పగబట్టినట్లు కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చి కొమ్ములతో పొడిచి పొడిచి అతి దారుణంగా దాడి చేసింది. చివరికి చుట్టూ ఉన్న వారు ఎంతో సేపు ప్రయత్నించి ఆవును తరిమేశారు. ఆపై గాయపడిన వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడి శరీరంలోని అనేక భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని రోడ్లపై తరచుగా విచ్చలవిడి పశువులు తిరుగుతున్నాయని, కొన్నిసార్లు ప్రజలకు హాని కలిగిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో తిరుగుతున్న విచ్చలవిడి పశువులను పట్టుకుని సురక్షితంగా ఉంచాలని స్థానిక నివాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


