Saturday, November 15, 2025
Homeవైరల్Cow Cess: బీరు కోసం బార్‌కి వెళ్తే బిల్లుపై 'ఆవు పన్ను'.. ఫొటో వైరల్.!

Cow Cess: బీరు కోసం బార్‌కి వెళ్తే బిల్లుపై ‘ఆవు పన్ను’.. ఫొటో వైరల్.!

Cow Cess On Beer: బీరు కోసం బార్‌కు వెళ్లిన కస్టమర్‌కి ఊహించని షాక్‌ తగిలింది. తనకు కావాల్సినవి ఆర్డర్‌ చేసుకుని బిల్లు తీసుకున్నాక.. దానిపై జీఎస్టీ, సెస్‌, వ్యాట్‌ కాకుండా ఆవు పన్ను ఉండటం చూసి ఖంగుతిన్నాడు. అసలు ఏంటీ ఆవు పన్ను.. మద్యం బిల్లుపై ఈ కొత్త పన్ను ఏంటని ఖంగు తిన్న కస్టమర్‌.. విషయం ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. ఇంతకీ ఏంటది.. ఇది ఎక్కడ జరిగింది.??

- Advertisement -

భారత్‌లో జీఎస్టీ రాకముందు వస్తువులు, సేవలపైన వ్యాట్‌, సెస్‌ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అన్ని పన్నులను కలిపి జీఎస్టీతోనే వసూలు చేస్తున్నారు. అయితే మద్యం, పెట్రోలు, డీజిల్‌ వంటి వాటిపై జీఎస్టీతో పాటు అదనంగా వ్యాట్‌, సెస్‌ కూడా వసూలు చేస్తున్నారు. కాగా, తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

Also Read: https://teluguprabha.net/viral/how-to-check-flight-safety-details-before-your-air-travel/

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్‌ 30న తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌లో ఆరు బీర్లు, మొక్కజొన్న వడలు ఆర్డర్‌ చేశాడు. కాగా, ఆ ఆర్డర్ మొత్తం విలువ రూ. 2,650 అయింది. అయితే జీఎస్టీ, వ్యాట్‌తోపాటు 20 శాతం ‘ఆవు పన్ను’తో కలిపి మొత్తం రూ. 3,262కు బిల్లు వేశారు. మద్యంపై ‘ఆవు పన్ను’ విధించడం చూసి షాక్‌ అయిన ఆ కస్టమర్‌.. ఆ బిల్లు ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

అయితే ఈ బిల్లులో ఆవు పన్నుపై ఆ బార్‌ యాజమాన్యాన్ని వివరణ కోరడంతో క్లారిటీ ఇచ్చింది. గోవుల రక్షణ, సంరక్షణ కోసం 2018లో రాజస్థాన్‌ ప్రభుత్వం ఆవు పన్నును ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. అప్పటి నుంచి మద్యం అమ్మకాలపై ఆ పన్ను వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చాలా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు దీనిని సర్‌ఛార్జ్‌గా పేర్కొంటాయి. కానీ తాము వ్యాట్‌లో అదనంగా ‘కౌ సెస్’గా ప్రస్తావిస్తామని ఆ బార్‌ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఆ పన్ను డబ్బును గో సంరక్షణ, ప్రచార సెస్‌గా ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad