Thursday, March 12, 2026
Homeవైరల్CP Sajjanar: సోషల్‌ మీడియా వ్యసనాలకు వాకిలి కాదు.. శివుడికి ప్రసాదంగా డ్రగ్స్ వీడియోపై సీపీ...

CP Sajjanar: సోషల్‌ మీడియా వ్యసనాలకు వాకిలి కాదు.. శివుడికి ప్రసాదంగా డ్రగ్స్ వీడియోపై సీపీ సజ్జనార్‌.!

CP Sajjanar Post: మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడికి గంజాయి చూపిస్తూ రీల్స్‌ చేసిన యువకులపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యూస్‌ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సజ్జనార్‌ ‘X’లో పోస్ట్‌ చేయడంతో సదరు యువకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన వారు హైదరాబాద్‌కి చెందిన వ్యక్తులుగా వెల్లడైంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cabinet-meeting-on-february-23rd/

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్‌ అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. నిత్యం రూ. కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ స్వాధీనం చేసుకుంటున్నారు. చెక్‌పోస్ట్‌ల్లో ఎంత నిఘా ఉన్నా.. ఏదో ఒక విధంగా రాష్ట్రాల్లోకి చొరబడి యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది చాలక, సోషల్‌ మీడియా వేదికగా పబ్లిక్‌గానే కొందరు యువకులు మత్తు పదార్థాల సంబంధిత వీడియోలు చేస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొందరు యువకులు గుడిలో దేవుడి ఎదుట గంజాయి చూపిస్తూ రీల్స్‌ చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దృష్టికి చేరడంతో ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 

దేవుడికి కొబ్బరికాయ, తీపి పదార్థాలు నైవేద్యాలు పెట్టాల్సిన చోట గంజాయిని ఉంచుతూ వికృత చేష్టలు చేసిన యువకుల తీరుపై సజ్జనార్‌ మండిపడ్డారు. శివయ్యకు గంజాయిని ప్రసాదంగా పెడుతున్నామంటూ ఇన్‌స్టా రీల్ పోస్టు చేశారు. అందరూ కొబ్బరికాయలు కొడితే శివుడికి ఫేవరెట్ ఉండాలని కొత్త ప్రసాదం పెడుతున్నామంటూ వెకిలి పనులకు పాల్పడ్డారు. ఈ వీడియోను సజ్జనార్‌.. తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది వికృతమైన ఉన్మాదమని… ఫేమస్ అవ్వడం కోసం ఇలా తెగించటం సరైంది కాదని ఫైరయ్యారు. 

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/ex-minister-errabelli-got-emotional-on-thorrur-municipality-lost/

‘దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం! మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు.. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. లైకుల కోసం – లోకాన్నే మరిచి.. వ్యూస్ కోసం – విలువలనే వదిలి.. రీల్స్ కోసం – రోడ్డున పడి.. మత్తులో మునిగి – జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి.. వ్యసనాలకు వాకిలిగా కాదు.’ అని పోస్ట్ చేశారు. 

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ యువకులను గుర్తించారు. ఫలక్‌నుమా జంగమ్మెట్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News