Saturday, November 15, 2025
HomeTop StoriesPre- wedding Shoot Video: వీళ్లు పిచ్చోళ్లా మంచోళ్లా?.. ఏకంగా గాలిలో ప్రీ వెడ్డింగ్ షూట్.....

Pre- wedding Shoot Video: వీళ్లు పిచ్చోళ్లా మంచోళ్లా?.. ఏకంగా గాలిలో ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదే..

Crane Pre- wedding Shoot Viral Video: నేటి తరం యువతలో పెళ్లి సందడి మొదలయ్యేదే ‘ప్రీ-వెడ్డింగ్ షూట్’ తో!.. ఇది ఇప్పుడు ఒక ట్రెండీ అంశంగా మారింది. వధూవరులు తమ మధుర క్షణాలను అపురూపంగా పదిలపరుచుకోవడానికి ఆకర్షణీయమైన థీమ్స్‌తో ప్రీ-వెడ్డింగ్ ఫోటో, వీడియో షూట్‌లు చేయించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. యువత ఉత్సాహానికి తగ్గట్టుగా ప్రీ-వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌లు, వీడియో ఎడిట్టర్‌లు కూడా కొత్త థీమ్స్‌తో వినూత్న పద్ధతుల్లో ఈ క్షణాలను మరింత అపురూపంగా మలుస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రీ-వెడ్డింగ్ షూట్‌ల ట్రెండ్‌ కోవకు చెందిన ఓ ప్రత్యేక వెడ్డింగ్ షూట్ వీడియో నెట్టింట విపరీతంగా చెక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.. ఇంతకి ఆ వీడియో ఏంటో మనం తెలుసుకుందాం.

- Advertisement -

ఈ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో వధూవరులు ఆకర్షణీయమైన రంగురంగుల బెలూన్ల గుత్తికి కట్టి ఉంటారు. కట్‌ చేస్తే ఆ జంటను గాల్లో పట్టుకున్న ఓ భారీ క్రేన్ హుక్‌ కనిపిస్తుంది. ఈ రీల్‌ని చూసిన నెట్టిజన్‌లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ రీల్‌ ను @gagan_buttar_46 అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షేర్‌ చేశారు. షేర్ చేసిన వ్యవధిలోనే పది లక్షల మంది కంటే ఎక్కువ మంది చూశారు. ఈ షూట్‌ చూసిన నెటిజన్లు, “ఇదెక్కడి వెడ్డింగ్‌ షూట్‌ రా బాబు!” అని కామెంట్స్‌ వర్షం కురిపించారు.
మరి కొందరు అయితే “పిచ్చి పిక్స్‌” అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.

అయితే ఈ మధ్యకాలంలో ‘ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో కొంతమంది జంటలు తమ షూట్‌లలో హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం, వివాదాస్పద థీమ్‌లను ఎంచుకోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. మరి కొందరు మురికి గుంటలు, రద్దీ రోడ్లు, లేదా నిషేధిత ప్రాంతాలైన పోలీస్ స్టేషన్లు, చారిత్రక కట్టడాలు వంటి చోట్ల షూటింగ్‌లు చేయడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అసభ్యకరమైన భంగిమలు, మితిమీరిన ముద్దు సన్నివేశాలు కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి.

‘ఇదేం పైత్యం?’ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం సంస్కృతి, సామాజిక విలువలను విస్మరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీని వలన సమాజంలో ఇబ్బందులు, అసౌకర్యం ఏర్పడుతున్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జ్ఞాపకాల కోసం తీయాల్సిన ఈ షూట్‌లు కేవలం సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించడం కోసమే అన్నట్లుగా మారడంపైనే ఎక్కువ మంది నెటిజన్‌లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad