Crocodile Viral Video: ఈ భూమ్మీద ప్రమాదకర జంతువుల్లో మెుసలి కూడా ఒకటి. వీటితో వ్యవహారించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొందరు వీటితో ఆటలు ఆడటానికి ప్రయత్నించి ప్రాణాలుపైకి తెచ్చుకుంటారు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మెుసలిపై కూర్చుని గుర్రపుస్వారీని చేయడానికి ప్రయత్నించగా చివరకు అదే అతడి పాలిట శాపమవుతోంది. ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఓ పార్కులోని ఎన్ క్లోజర్లో మెుసళ్లు ఉంటాయి. వాటి దగ్గరకు అక్కడున్న ట్రైనర్ వెళ్తాడు. అతడు మెుసలితో ఆటలు ఆడటానికి ప్రయత్నిస్తాడు. ముందుగా అతడు మెుసలిపైకి ఎక్కి గుర్రపుస్వారీ చేయడానికి ప్రయత్నిస్తాడు. కర్ర పట్టుకుని నువ్వు అలా వెళ్లు ఇలా వెళ్లు అని దానికి ఆర్డర్ వేస్తాడు. ఇంతలోనే పక్కనే ఉన్న వేరే మెుసలి అతడిని కరవడానికి వస్తుంది. అది గమనించిన అతడు మెుసలిపై నుంచి దిగుతాడు. అయితే అతను పైకి లేవగానే అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న మెుసలి ఒక్కసారిగా అతడిపై దాడి చేస్తుంది. అతడి చేయి పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. అయితే అతడు ఏదోలా దాన్ని నుంచి తప్పించుకుంటాడు. ఈ సంఘటనను పార్కుకు వచ్చిన సందర్శకులు వీడియో తీస్తారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
మెుసళ్లు సరీసృపాలు. ఇవి డైనోసార్ ల కాలం నుండి ఈ భూమి మీద జీవిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులకు ఎన్నో జీవులు అంతరించినప్పటికీ మెుసళ్లు జాతి మాత్రం నిలబడింది. వీటి శరీర నిర్మాణమే దీనికి ప్లస్. నీటిలో వేగంగా కదలడానికీ, ఇతర జంతువులను వేటాడటానికి సౌకర్యంగా ఉంటుంది. వీటి దవడలు చాలా బలిష్టంగా ఉంటాయి. అందుకే ఎలాంటి జంతువునైనా దాని దవడలతో నమిలేయగలదు. క్రోకడైల్స్ పళ్లు రంపాల్లా ఉంటాయి. అందుకే చేపలను ఇవి ఈజీగా ముక్కలు చేయగలవు. మెుసళ్లకు మనదేశంలో ఒడిశాలోని బితర్కనికా నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందింది. మెుసళ్లలో ఎలిగేటర్లు, ఘరియల్, ఘగ్గర్, కెయ్ మన్ వంటి జాతులు ఉన్నాయి.