Customer Compliments to Blinkit Delivery boy ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ.. ఇప్పుడు ఈ సర్వీస్ లేనిదే నగరవాసుల జీవనం గడవడం కష్టం. కేవలం టిఫిన్స్, మీల్స్ మాత్రమే కాదు సరుకులను సైతం డెలివరీ చేస్తూ కస్టమర్ల అవసరాలను చిటికెలో తీరుస్తోంది. ఈ క్రమంలో ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ రంగంలో తీవ్ర పోటీ సైతం నెలకొంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కాంట్లను అందిస్తున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకొనేది.. 10 మినిట్స్ డెలివరీ.. చెప్పిన సమయానికి కొద్దిగా లేట్ అయినా.. సదరు కంపెనీలు ఏదో ఒక విధంగా మూల్యాన్ని చెల్లించుకుంటాయి. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్ కొన్ని కారణాల వల్ల సరుకులు డెలివరీ చేయడం లేట్ అయింది. కానీ.. అతని నిజాయతీని మెచ్చిన ఓ కస్టమర్.. ఆ వ్యక్తి గురించి స్పెషల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వార్త వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/chandrababu-cabinet-meeting-motha-cyclone-praise/
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీస్ డెలివరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ట్రాఫిక్ అవస్థలను దాటుకుంటూ.. చెప్పిన టైంలోనే ఆర్డర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. మార్గమధ్యలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బైక్‌లో పెట్రోల్, బైక్ కండిషన్ ఇవన్నీ డెలివరీ బాయ్స్ చూసుకోవడం చాలా అవసరం. కానీ ఇక్కడ ఓ డెలివరీ బాయ్‌కి మార్గమధ్యలో ఓ చిక్కు వచ్చి పడింది. అయినప్పటికీ ఆర్డర్ డెలివరీకి ఆతను పడి కృషి మెచ్చుకోదగినది అని చెప్పొచ్చు.
ఓ కస్టమర్.. ప్రముఖ ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ నుంచి కొన్ని సరుకులు ఆర్డర్ చేశారు. ఆర్డర్ డెలివరీ చేయడానికి బయలుదేరిన బ్లింకిట్ డెలివరీ బాయ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో ఈవీ డిశ్చార్చ్ అయింది. కానీ, సమీపంలో ఎక్కడా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో తను వాహనాన్ని అలాగే కస్టమర్ ఇంటి అడ్రస్ వరకూ తోసుకుంటూ వెళ్లాడు. ఆర్డర్ డెలివరీ చేసిన అనంతరం కస్టమర్‌కు తన పరిస్థితిని వివరించాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్ ‘X’లో పోస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/international-news/america-shutdown-closing-soon/
‘డెలివరీ బాయ్ తన ఈవీ ఛార్జింగ్ అయిపోవడంతో కొన్ని నిమిషాలు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చా.. అని అడిగాడు. ఛార్జింగ్ పెట్టిన గంట సేపు అతను డిస్టర్బ్ చేయకుండా బయటే కూర్చున్నాడు. ఛార్జింగ్ చేసిన తర్వాత డబ్బులు చెల్లించబోయాడు. నేను సున్నితంగా తిరస్కరించాను. కానీ కృతజ్ఞత చూపించుకోవడానికి నాకు మిల్కీబార్ ఇచ్చాడు. అతని నిజాయతీ, క్యారెక్టర్‌ను మెచ్చుకోవాలి. సంపాదన తక్కువైనా అతను ఏదీ ఫ్రీగా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వారికే ఇచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది.‘ అని కస్టమర్ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరికి దాతృత్వ గుణం లేకపోయినా.. వారి వద్ద ఉన్న సంపద గురించి, పొగడ్తలు చెప్పుకొంటారని వారి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Blinkit guy came late!
He told me that his EV vehicle got discharged mid way so he has to drag!
Requested me, “If he can charge the battery for few minutes?”
He sat outside for an hour while his battery was getting charged!
After charging he asked me that he’ll pay for the…
— Neha Moolchandani (@neha_basic) November 7, 2025


