Little Girl Dancing Viral Video Instagram: నేటికాలం పిల్లలు ఎంతో ఫాస్ట్ అండ్ టాలెంటెడ్‌గా ఉంటున్నారు. చదువుల్లోనే కాకుండా ఆట, పాట, డ్యాన్స్‌లలో కూడా వారి సత్తాని చాటుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చురుకుగా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఒకప్పటి జనరేషన్ లో కేవలం చదువుకే పరిమితంగా ఉండేవారు కానీ ఇప్పుడు వచ్చిన డిజిటల్ ప్రపంచంతో పిల్లలు పాఠ్యపుస్తకాలకు అతీతంగా వారి సామర్థ్యాలను చాటుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారి కలలు కలగానే ఉండనివ్వకుండా వాటిని నిజం చేసుకోవడానికి వారిని ప్రోత్సహిస్తున్నారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డ్యాన్స్ వీడియోలు, పాటలు, వంటల ప్రదర్శనలను కూడా ఈ తరం పిల్లలు ఎంతో సునాయాసంగా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి వారి రోజువారీ జీవితాన్ని వీడియో రూపంలో చిత్రీకరిస్తూ డబ్బులు సంపాదిస్తే మరి కొందరు డ్యాన్స్, డైలాగ్‌లు డెలివరీ, సాంస్కృతిక నృత్యాలు చేస్తూ నెటిజన్‌లను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ క్యూట్ ఐదేళ్ల పాప డాన్స్ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
@adorable_aanyaa ఓ ఐదేళ్ల పాప ‘రాధా గోరి గోరి’ పాటకు చేసిన డ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నీలిరంగు లెహంగాలో ముద్దు ముద్దు స్టెప్పులతో నెటిజన్ల మనసును దోచుకుంటుంది. ఇప్పటికే ఈ వీడియోకు 9,555 లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరు ” వాట్ ఏ క్యూట్ డాన్స్” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు హార్ట్ సింబల్స్‌తో కామెంట్ చేస్తున్నారు. aanyaa rahul patel, అహ్మదాబాద్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2M ఫాలోవర్‌లు ఉన్నారు. ఈ ఆకౌంట్‌ను @rahul patel తండ్రి మ్యానేజ్ చేస్తున్నారు. ఆన్యా కేవలం డాన్స్‌లోనే కాకుండా, యోగాలో కూడా మంచి నైపుణ్యాన్ని సాధించింది. ఆన్యా యోగా డే రోజున చేసిన వీడియోకు సుమారు 309k లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ఇదిగో..
సోషల్ మీడియా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అది సవాళ్లుగా మారుతుందని కొంతమంది భావిస్తున్నారు. పిల్లల కలలను బయట పెట్టడంలో తప్పులేదు కానీ కొంతమంది తల్లిదండ్రులు తాము ఫేమస్ అవ్వాలని వారిపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ ప్రపంచంలో భద్రత, సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.