Saturday, November 15, 2025
Homeవైరల్Karnataka: కాసేపట్లో అంత్యక్రియలు.. శ్వాస తీసుకున్న మృతదేహం!

Karnataka: కాసేపట్లో అంత్యక్రియలు.. శ్వాస తీసుకున్న మృతదేహం!

Viral news in Karnataka: కర్ణాటకలోని ధార్వాడ్‌లో అద్భుత ఘటన చోటు చేసుకుంది. మరణించి వ్యక్తికి అంత్యక్రియల చేసేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో.. మృతదేహం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఆశ్చర్యానకి గురైయ్యారు.

- Advertisement -

శ్వాస తీసుకున్న మృతదేహం: సినిమాటిక్ ట్విస్ట్‌ను తలపించేలా ఒక అద్భుత ఘటనకు కర్ణాటక రాష్ట్రం వేదిక అయ్యింది. ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు మరణించారని భావించారు. దీంతో అతడికి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే మృతదేహంలో కదలికలు వచ్చాయి. అసలేం జరిగిందంటే గదగ-బెటగేరి నివాసి అయిన నారాయణ వన్నాల్ (38) తీవ్ర అనారోగ్యంతో ధార్వాడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. దీంతో అతడికి డాక్టర్లు ఆరు శస్త్రచికిత్స చేశారు. అయినా అతడి పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో నారాయణను వెంటిలేటర్‌పైనే ఉంచారు. ఆయన కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆశలు వదులుకున్నారు. అతడిలో ఎలాంటి చలనం లేక పోవడంతో మరణించినట్టుగా భావించారు.

మృతదేహంలో కదలికలు: నారాయణ వన్నాల్ చనిపోయారని భావించిన బంధువులు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు అతనిని అంబులెన్స్‌లో గదగ్‌కు తీసుకువెళ్లారు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా నారాయణ వన్నాల్ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం బంధువులు గమనించారు. దీంతో ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. వెంటనే నారాయణను సమీపంలోని బెటగేరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరణం అంచుల వరకు వెళ్లి.. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో తిరిగి ప్రాణం పోసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Also Read:https://teluguprabha.net/viral/watch-lovers-hot-romance-in-running-auto-in-hyderabad-video-goes-viral-on-social-media/

వైద్య వర్గాల్లో తీవ్ర చర్చ: మృతదేహంలో వచ్చిన కదలికలపై వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అసాధారణ పరిస్థితిని లేట్ డిటెక్షన్ ఆఫ్ డెత్ అని లేదా మరణాన్ని ఆలస్యంగా గుర్తించడం అని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనిషి చనిపోయినప్పుడు శరీరం చాలా త్వరగా చల్లబడుతుంది. అయితే మృతదేహాన్ని తరలించే సమయంలో జరిగిన శారీరక కదలిక కారణంగా గుండెకు లేదా ప్రధాన రక్తనాళాలకు రక్త ప్రసరణ మళ్లీ ప్రారంభమై ఉండవచ్చు అని వైద్యులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad