Cobra snake in toilet: వానకాలంలో పాముల బెడద ఎక్కువైపోయింది. భారీ వర్షాలకు పాములు ఇళ్లలోకి తెగ వచ్చేస్తున్నాయి. ఇవి బెడ్ రూమ్ ల్లోని, టాయిలెట్స్ లోని, బూట్లలోని దూరిపోతున్నాయి. మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న సరే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ మధ్య కాలంలో పాములు వీడియోలను ఎక్కువగా చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. దాని అనుగుణంగానే నెటిజన్స్ కూడా పాముకు సంబంధించిన ఏ చిన్న వీడియో షూట్ చేసినా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. గుజరాత్ వాపిలోని శ్రీ రంగ్ సొసైటీకి చెందిన ఒక ఇంట్లోకి భారీ నాగుపాము దూరి కలకలం సృష్టించింది. రోజులానే ఇంట్లోని కుటుంబ సభ్యులు వాష్ రూమ్ కు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి బాత్రూమ్ కమోడ్ లో పెద్ద నాగుపాము నక్కి ఉంది. దీంతో వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ కింగ్ కోబ్రా కోపంతో బుసలు కొడుతూ..వారిపై దాడికి యత్నించింది. భయాందోళన చెందిన ఇంటి సభ్యులు వాష్ రూమ్ క్లోజ్ చేసి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పాముల పట్టే వ్యక్తి ఆ నాగును బంధంచడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కిలాడీ స్నేక్ అతడికి దొరక్కుండా స్నేక్ క్యాచర్ ను ముప్పు తిప్పులు పెట్టింది. అది ఏకంగా కమోడ్ లోపల ఉండే హోల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అతడు ఎంతో నేర్పుతో చాకచక్యంగా ఆ భారీ నాగుపామును పట్టుకున్నాడు. ఈ వీడియోను namastevapi అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. వీక్షించే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ థ్రిల్లింగ్ వీడియోను చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ”ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వరా..” అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.