Deepavali 2025 in India: దేశం మెుత్తం దీపావళి పండుగను జరుపుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే దుకాణాలన్నీ మందుగుండు సామాగ్రితో కళకళ్లాడుతున్నాయి. పండుగ వీకెండ్ రావడంతో ఫెస్టివల్ ను చేసుకునేందుకు సిటీల్లో ఉన్న జనాలు సొంతూళ్లకు పయనమయ్యారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగను ఒక్క ఊళ్లో మాత్రం జరుపుకోరు. అదే హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలో ఉన్న సమ్మూ అనే గ్రామం. అక్కడి ప్రజలు ఈ వేడుకను ఎందుకు జరుపుకోరు, దీని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.
శతాబ్దాల శాపమే కారణమా..
జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమ్మూ అనే పల్లెటూరు. ఈ గ్రామంలో దీపావళి పండుగపై నిషేధం ఉంది. కొన్ని వందల ఏళ్లు కిందట..ఒక గర్భిణీ స్త్రీ దీపాల పండుగకు సిద్ధమవుతుండగా..స్థానిక రాజు సైన్యంలో సైనికుడిగా ఉన్న ఆమె భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆ స్త్రీ మూర్తి భర్త చితి మంటలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మనం దీనినే సతీసహగమనం అని కూడా అంటారు. అయితే ఆమె భర్త చితిలోకి దూకే ముందు గ్రామంలో ప్రజలు ఎప్పటికీ దీపావళి జరుపుకోకూడదని శాపం విధించిందని గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read: Viral video -అమ్మాయిలు ఇలా ఉన్నారేంట్రా..! ముసలోడుతో టీనేజ్ గర్ల్ సీక్రెట్‌గా ఏం చేస్తుందో తెలుసా?
ఆ ఊరిలో ప్రజలు దీపావళి జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా.. ఎవరైనా చనిపోవడం, గ్రామంలో ఏదైనా విపత్తు సంభవించడం జరుగుతోందని స్థానికులు తెలిపారు. అయితే శాప విముక్తి కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఏ మార్పు లేదట. మూడేళ్ల కిందటే గ్రామంలో దీని కోసం పెద్ద యజ్ఞం చేసిన ఫలితం లేకపోయిందట. శతాబ్దాలు గడుస్తున్నా, టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందినా.. శాపం యెుక్క ప్రభావం ఇంకా అలానే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శాపం యొక్క ప్రభావం ఎంతగా ఉందంటే.. దీపావళి నాడు ఆ ఊరి ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రారట.


