Drunk man riding on Tiger: మనలో చాలా మంది మద్యం తాగితే ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తారు. తాగిన మైకంలో కొందరు మనసులోని మాటలన్నింటిని బయటపెడితే.. మరికొందరు వచ్చిరాని ఇంగ్లీష్ భాషను మాట్లాడుతుంటారు. ఇంకొంత మంది తమ కోపాన్ని, ఫ్రస్టేషన్ ను ఇతరులపై తీర్చుకుంటారు. కొందరికి తాగితే ఎక్కడ లేని దైర్యం వచ్చేస్తుంది, రకరకాల డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. యువకులు తమ ప్రేమను వ్యక్త పరచడానికి మందు తాగుతారు. పెళ్లాం తిట్టిందనో, జాబ్ రాలేదనో, పనిచేసే చోట ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్లో కూడా కొంత మంది డ్రింక్ చేస్తారు. తాజాగా అలాంటి తాగుబోతు వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సాధారణంగా అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోకి క్రూరమృగాలు సర్వ సాధారణం. ఇవి ఎక్కువగా రాత్రిళ్లు వేటాడుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ పెద్ద పులి అర్ధరాత్రి జనావాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలో దానికి ఒక అనుకొని ఘటన ఎదురైంది. తప్పతాగి రోడ్డు మీద తిరుగుతున్న ఓ మందుబాబు దాని పిల్లి అనుకున్నాడో లేదా గుర్రం అనుకున్నాడో ఏమో కానీ దాని మీద ఎక్కి స్వారీ చేయడం మెుదలుపెట్టాడు.
పులి కూడా కార్తీక మాసం చేస్తుందో ఏమో కానీ అతడిని ఏమీ అనలేదు. ఎంచెక్కా అతడిని తనపై ఎక్కించుకుని అటు ఇటు తిరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అది బయటకు రావడంతో నెట్టంట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఓరేయ్ అది పులిరా.. గుర్రం కాదు.. అంటూ పంచ్ ల వేస్తున్నారు. ఇది ఏఐ వీడియో అని మరికొంత మంది కొట్టిపారేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
Also Read: Viral -ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. కట్ చేస్తే..!


