Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: దీపావ‌ళికి గిఫ్ట్‌గా సోన్ పాపిడి.. కోపంతో కంపెనీ గేట్ ఎదుట పడేసిన ఉద్యోగులు

Viral Video: దీపావ‌ళికి గిఫ్ట్‌గా సోన్ పాపిడి.. కోపంతో కంపెనీ గేట్ ఎదుట పడేసిన ఉద్యోగులు

Soan Papdi Diwali Gift Video: దీపావళి పండుగ వచ్చిందంటే ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీల నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తాయి. అది బోనస్‌ కావచ్చు.. లేదా ఏదైనా గిఫ్ట్‌ కావచ్చు. కాగా, ఈ ఏడాది పలు కంపెనీలు తమ ఉద్యోగులు వాహనాలు, లేదా డబ్బు రూపంలో బోనస్‌, ఇంకా పలు రకాల కాస్ట్లీ స్వీట్లు బహుమతిగా ఇవ్వడం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఇక్కడ ఓ కంపెనీ ఇచ్చిన ఓ బహుమతిని చూసి మాత్రం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోపంతో ఆఫీసు గేటు బయటే విసిరికొట్టారు. ఇంతకీ ఏంటా గిఫ్ట్‌ అంటే.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-police-commemoration-day-cm-revanth-reddy-hails-martyrs-sacrifice/

దీపావళి సందర్భంగా ఒక కంపెనీ తమ ఉద్యోగులకు సోన్ పాపిడి డబ్బాను గిఫ్ట్‌గా ఇచ్చింది. మిగతా స్వీట్లతో పోలిస్తే సోన్ పాపిడి స్వీటు ఖరీదు చాలా తక్కువ. దీంతో మండిపడిన ఉద్యోగులు ఆ స్వీటు డబ్బాను కంపెనీ గేటు దగ్గర విసిరి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. హ‌ర్యానాలోని గ‌న్నౌర్ ఇండ‌స్ట్రీ ఏరియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad