Snake in House: పాములు అంటేనే కొందరికి హడల్. అదిగో పాము అంటే.. ఆమడదూరం పారిపోతారు. అటు వైపు కూడా తిరిగిచూడరు. మరికొందరికైతే పామును చూస్తేనే చుచ్చు పడుతుంది. మరి అలాంటి పాము ఎవరికి తెలియకుండా ఇంట్లో దూరి.. వింత శబ్ధాలు చేస్తే ఎలా ఉంటుందో ఇక ఊహించక్కర్లేదు. సరిగ్గా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది.
ఇంటి సీలింగ్ ప్యానల్‌లో పాము: పాము కనిపిస్తేనే గుండెలు గుభేల్ మంటాయి. మరి అదే పాము ఇంట్లో ఉన్న సీలింగ్ ప్యానల్‌లోకి దూరితే.. ఆ ఇంట్లోని వారి పరిస్థితి ఎలా ఉంటుంది. కళ్లకు కనిపించని పాము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కాటు వేస్తుందో అన్న భయంతో వణికిపోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో సరిగ్గా .. ఇలాంటి భయంకరమైన ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా పాము ఇంటి సీలింగ్ ప్యానల్‌లోకి చొరబడి కుటుంబ సభ్యులను హడలెత్తించింది.
శబ్దాలను గమనించిన కుటుంబసభ్యులు: నోయిడా సెక్టార్ 51లోని ఒక ఇంట్లో కుటుంబసభ్యులు హాయిగా నిద్రిస్తున్నారు. ఆ సమయంలో పైకప్పు నుంచి వింత శబ్దాలు వినిపించాయి. మొదట దాన్ని ఫ్యాన్స్ సీలింగ్ లైటుకు సంబంధించిన వైరింగ్ సమస్యని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ అది ఫ్యాన్స్ సీలింగ్ లైటుకు సంబంధించిన శబ్దాలు కాదని గ్రహించారు. అసలు ఎలా శబ్దాలు వస్తున్నాయని గమనిస్తే.. లైటు పక్కనే ఒక పాము కదులుతూ కనిపించింది. ఇక వాళ్ల పరిస్థితి ఊహించక్కర్లేదు. అది కాసేపటికి సీలింగ్ ప్యానల్‌లోకి దూరిపోయి అటూ ఇటూ తిరుగుతూ.. వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. దాన్ని బయటకు పంపించేందుకు చాలా ప్రయత్నించారు.. కానీ ఫలితం లేకపోయింది.
Also Read: https://teluguprabha.net/viral/watch-rare-four-headed-cobra-snake-videos-goes-viral-on-social-media/
అటవీశాఖ అధికారులకు సమాచారం: కుటుంబసభ్యులు చేసేదేమీ లేక వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చే వరకు భయంతో ఆ కుటుంబం రాత్రంతా ఇంటి బయటే గడపాల్సి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు పామును సురక్షితంగా పట్టుకున్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం కాబట్టి పాములు ఇళ్లలోకి రాకుండా ఇంటి పైకప్పులు, బాత్రూమ్‌లలోని కిటికీలు వంటి వాటిని ఎప్పుడూ మూసి ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇళ్లలో పాములు కనిపిస్తే వాటికి ఎలాంటి హాని చేయరాదని అన్నారు. వెంటనే అటవీ సంరక్షణ విభాగానికి సమాచారం అందించాలని అధికారులు కోరారు.


