Farmer Uses Drones for Pigs: పొలాల్లో పందులు, ఎలుకల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పడని పాట్లు అంటూ ఉండవు. పొలాలకు ఎలక్ట్రిక్ కంచె వేయడం, దిష్టి బొమ్మలు పెట్టడం.. ఇలా చాలా రకాల పద్ధతులతో పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించి పందులను తరలించేందుకు ఓ రైతు చేసిన పని స్థానికులకు కష్టాలు తెచ్చిపెట్టింది. అదేంటంటే..
Also Read: https://teluguprabha.net/national-news/flying-car-v5000-matrix-evtol-features-speed-technology/
నైరుతి చైనాలోని ఒక రైతు డ్రోన్ ద్వారా పందులను తరలిస్తుండగా ఒక పంది గాల్లో చిక్కుకోవడంతో అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో రైతు గ్రామంలో 10 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డ్రోన్ తాడు విద్యుత్ లైన్‌కు చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.
సిచువాన్ ప్రావిన్స్‌లోని టోంగ్జియాంగ్ కౌంటీలోని పర్వత ప్రాంతంలో నివసిస్తున్న ఓ రైతు ఇటీవల ఓ రోజు ఉదయం డ్రోన్‌ను ఉపయోగించి పందులను వధశాలకు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండటంతో వాహనం ద్వారా పందులను రవాణా చేయడం కష్టమవుతుందని డ్రోన్ సాయంతో పందులను తరలించేందుకు యత్నించాడు. అయితే, మొదటి పందిని ఎత్తుతుండగా, పర్వతం దిగుతున్నప్పుడు డ్రోన్ టెథర్ హై వోల్టేజ్ విద్యుత్ లైన్‌లో చిక్కుకుంది. దీంతో అది గాల్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో చీకటిగా ఉండటంతో కూడా ఈ పరిస్థితి తలెత్తింది.
Also Read: https://teluguprabha.net/health-fitness/fruits-that-are-rich-in-vitamin-e/
ఫలితంగా విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడి.. గ్రామంలో 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోయింది. దీంతో మరమ్మతుల కోసం 12 మంది కార్మికులను పంపించామని.. ఇందుకు దాదాపు 10,000 యువాన్లు ఖర్చయిందని సంబంధిత అధికారి తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు గ్రామానికి విద్యుత్ పునరుద్ధరించినట్లు వివరించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతు నో-ఫ్లై జోన్‌లో డ్రోన్‌ను ఎగురవేసి, డ్రోన్‌ను ఓవర్‌లోడ్‌లో ఎక్కించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తాము ఇంకా ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. రైతు చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైతే, రైతు పరిపాలనాపరమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్ పరికరాలకు జరిగిన నష్టానికి రైతే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.

