Homeవైరల్VIRAL: బెంగళూరులో వడగళ్ల వాన.. చిన్నపిల్లాడిలా మారిన మాజీ పేసర్!

VIRAL: బెంగళూరులో వడగళ్ల వాన.. చిన్నపిల్లాడిలా మారిన మాజీ పేసర్!

Venkatesh Prasad: ఎండ వేడిమితో అల్లాడుతున్న సిలికాన్ సిటీ వాసులకు వరుణుడు చల్లని కబురు అందించాడు. బెంగళూరులో అనూహ్యంగా కురిసిన వడగళ్ల వాన నగరవాసులకు ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రకృతి వింతను చూసి టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్, ప్రస్తుత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ పరవశించిపోయారు.

- Advertisement -

చిన్నపిల్లాడిలా మారిన వెంకటేష్ ప్రసాద్: వడగళ్ల వాన కురుస్తున్న సమయంలో తన కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్ ప్రసాద్.. వర్షం జోరును చూసి ఒక్కసారిగా తనను తాను నియంత్రించుకోలేకపోయారు. వెంటనే కారు దిగి రోడ్డుపైకి వచ్చి వర్షంలో తడిశారు. మైదానంలో ఎంతో గంభీరంగా కనిపించే ఈ వెటరన్ క్రికెటర్ నేలపై పడిన వడగళ్లను చేతుల్లోకి తీసుకుని ఒక చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టారు. ఆ వడగళ్లను చూపిస్తూ ఆయన ముఖంలో కనిపించిన ఆనందం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Also read-Pakistan: బర్రెలకు డైపర్లు.. లేదంటే జరిమానా!

సోషల్ మీడియాలో వైరల్: వెంకటేష్ ప్రసాద్ వర్షంలో ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రకృతి ముందు ఎంతటి వారైనా పిల్లలే.. వెంకటేష్ ప్రసాద్‌ను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఆయన మళ్లీ తన చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోయారంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News