Saturday, November 15, 2025
Homeవైరల్Brown Woman: 'నా చర్మం రంగు వల్లే సీఈఓ పదవి తీసేశారు' - మహిళా పారిశ్రామికవేత్త...

Brown Woman: ‘నా చర్మం రంగు వల్లే సీఈఓ పదవి తీసేశారు’ – మహిళా పారిశ్రామికవేత్త వీడియో వైరల్!

Founder Alleges Removal as CEO for Being a Brown Woman: “పదేళ్లుగా కష్టపడి స్థాపించుకున్న కంపెనీ నుంచి, కేవలం నేను ‘బ్రౌన్ ఉమన్’ (భారత/విదేశీ సంతతికి చెందిన మహిళ) అయినందుకే నన్ను సీఈఓ పదవి నుంచి తొలగించారు.” అంటూ ఓ మహిళా పారిశ్రామికవేత్త చేసిన ఆరోపణలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఆమె చర్మం రంగు, జెండర్ కారణంగా కంపెనీకి పెట్టుబడులు ఆకర్షించడం కష్టమవుతుందని కంపెనీ బోర్డు భావించి, ఈ కఠిన నిర్ణయం తీసుకుందని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో, ఆమెకు మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వివక్షకు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడినందుకు ఆమెను ప్రశంసిస్తున్నారు.

ALSO READ: H-1B Visa Rules: హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినం: దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు!

ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే?

“జూలై 2024లో, నేను సహ-స్థాపించి, పదేళ్లుగా నడిపిస్తున్న కంపెనీకి, నా స్థానంలో ఒక శ్వేతజాతీయుడిని (White Man) సీఈఓగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఒక బ్రౌన్ ఉమన్‌ను తొలగించి, ఆ స్థానంలో ఒక శ్వేతజాతీయుడిని నియమించడం వెనుక ఉన్న కారణం మీరు తెలుసుకోవాలి,” అంటూ ఆమె తన కథనాన్ని ప్రారంభించారు.

 

View this post on Instagram

 

A post shared by Vidya (@hellovidya)

“ఒకరోజు మా ఇన్వెస్టర్లలో ఒకరు, ‘నీ చర్మం రంగు లేదా నువ్వు మహిళ కావడం వల్ల ఏమైనా పెట్టుబడులు రావడం కష్టమవుతోందా?’ అని సాధారణంగా అడిగారు. ఆ తర్వాత, నన్ను తొలగించి ఆ శ్వేతజాతీయుడిని సీఈఓ చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. అయితే ఒక బ్రౌన్ ఉమన్‌ను తొలగించి వైట్ మ్యాన్‌ను నియమిస్తే బయటకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని (optics) ఆందోళన చెందారు. దీంతో ఇద్దరినీ కో-సీఈఓలుగా నియమించాలని ప్రతిపాదించారు.”

“అయితే అసలు డ్రామా అప్పుడే మొదలైంది. బోర్డు సభ్యుల్లో ఒకరు నాకు ఫోన్ చేసి, ‘మేము కొత్త సీఈఓకు ఒక జీతం నిర్ణయించాం, కానీ ఒక బ్రౌన్ ఉమన్‌గా నీకు, ఆ శ్వేతజాతీయుడితో సమానంగా జీతం ఇవ్వలేం’ అని చెప్పేంత ధైర్యం చేశారు. జీతం విషయంలో బోర్డు ఒక నిర్ణయానికి రాలేక, చివరికి ఆ శ్వేతజాతీయుడినే పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది,” అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వస్తోంది. “మీరు ధైర్యంగా మీ కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి విషయాలపై మరింత మంది మహిళలు మాట్లాడాలి,” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “వారికి లోలోపల శ్వేతజాతీయులే కంపెనీని నడపగలరనే నమ్మకం ఉంటుంది,” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ALSO READ: Nobel Peace Prize: నిరంకుశత్వంపై అలుపెరుగని పోరు.. 14 నెలలుగా అజ్ఞాతవాసం.. వెనిజులా ‘ఐరన్ లేడీ’ కథ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad