Goa Airport Garba Dance: విమానాశ్రయాల్లో అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు ఆలస్యమవడం చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ప్రయాణికులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం.. లేదా మరేదారి లేక ఫోన్లలో కాలక్షేపం చేయడం, లేదంటే రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ గోవా ఎయిర్‌పోర్టులో మాత్రం భిన్న వాతావరణం కనిపించింది. ఆ సమయాన్ని ప్రయాణికులు వృధా చేయకుండా మధుర స్మృతులను మిగుల్చుకున్నారు. అదేంటో ఇక్కడ చూద్దాం.
Also Read: https://teluguprabha.net/telangana-news/tpcc-chief-mahesh-goud-slams-etela-bandi-on-bc-issues/
ఇటీవల గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం.. పైలట్ అనారోగ్యం కారణంగా ఆలస్యమయింది. దీంతో గోవా నుంచి సూరత్‌కు వెళ్లి గర్బా ఉత్సవాల్లో పాల్గొనాలని భావించిన మయూర్ అనే వ్యక్తి ఫ్లైట్ ఆలస్యం అనే వార్త నిరావశపరిచింది. ఆ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో పంచుకున్నాడు. మయూర్ నిరాశను గమనించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. అద్భుతమైన ఆలోచన చేసి వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/kollywood-hero-simbu-to-joins-hands-with-ntr-for-devara-2/
ప్రయాణికుడు ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కోరికను నెరవేర్చడానికి సిద్ధమయ్యారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోనే మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి గర్బా పాటలను ప్లే చేశారు. దీంతో మయూర్‌తో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉత్సాహంలో మునిగిపోయి, సామూహికంగా గర్బా నృత్యంలో పాల్గొన్నారు. ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కూడా డ్యాన్స్‌లో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
ఈ అద్భుతమైన క్షణాలను తోటి ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం ఆలస్యం కావడంతో ఏర్పడిన నిరుత్సాహాన్ని మర్చిపోయేలా ఈ గర్బా నృత్యం ప్రయాణికులకు మరపురాని అనుభూతిని మిగిల్చిందని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


