Giri nagu viral video in Telugu: ఈ భూమ్మిద పాముల్లోకెల్లా విషపూరితమైనది ఏదంటే కింగ్ కోబ్రా. ఇది ఒక్క కాటుతో ఎలాంటి దానినైనా చంపేయగలదు. అనకొండ, కొండచిలువల తర్వాత ఎక్కువ పొడవు ఉండేవి కింగ్ కోబ్రాలే. వీటి సైజు ఎంత పెద్దగా ఉంటే అంత ప్రమాదకరం. కోబ్రా జాతుల్లో ఒకటైన నార్తర్న్ కింగ్ కోబ్రా రీసెంట్ గా జనవాసాల్లోకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన స్నేక్ క్యాచర్ ను ముప్పుతిప్పులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే… ఓ నార్తర్న్ కింగ్ కోబ్రా రెండు ఇళ్ల మధ్య సందులోకి పాకుతుంది. ఇది చూడటానికి చాలా పొడవు ఉంది. దీంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారమిచ్చారు. ఇంతలో అక్కడ వచ్చిన అతడు ఏ మాత్రం బెదిరిపోకుండా ఎంతో చాకచక్యంగా అరగంటసేపు పోరాడి దానిని సంచిలో వేసుకున్నాడు.
ముందుగా అతడు పీవీసీ పైపు కట్టిన సంచిని దాని ముందు ఉంచాడు. అయితే కోబ్రా అందులోకి దూరకండా స్నేక్ క్యాచర్ పై పలు మార్లు దాడికి యత్నించింది. జస్ట్ లో మిస్ లేకపోతే అతడి ప్రాణాలు పోయేవి. అయినా సరే పట్టు వదలని అతడు దానిని ఎట్టకేలకు పట్టేశాడు. తర్వాత దానిని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త ట్రెండ్ అయింది. దానిని పట్టే విధానం చూస్తే మన గుండెల్లో గుబులు పడుతుంది. అలా ఉంది ఆ వీడియో. ఈ కోబ్రానే మన తెలుగు రాష్ట్రాల్లో గిరి నాగుగా పిలుస్తుంటారు.
Also Read: Hens vs Baby cobra – రెండు భారీ కోళ్లను భయపెట్టిన బుల్లి నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వర్షాకాలం నడుస్తూ ఉండటంతో ఇళ్లలోకి పాములు వచ్చేస్తుంటాయి. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వాటి కాటుకు బలివ్వాల్సిందే. అందుకే ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పచ్చదనం ఉన్న చోటే ఎక్కువగా పాములు నక్కి ఉంటాయి, కాబట్టి కేర్ పుల్ గా ఉండాలి. ఈ మధ్య నెట్టింట స్నేక్ వీడియోలు ఆదరణ ఎక్కువైంది. సర్పాల వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఎక్కువగా ఇష్టపడుతుండటంతో రోజూ పుట్టగొడుగుల్లా పాముల వీడియోలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.


