Thursday, June 26, 2025
Homeవైరల్Crazy idea: ఎలా వస్తాయ్ రా బాబు ఇలాంటి ఐడియాలు.. ముఖానికి తామర ఆకుల మాస్క్...

Crazy idea: ఎలా వస్తాయ్ రా బాబు ఇలాంటి ఐడియాలు.. ముఖానికి తామర ఆకుల మాస్క్ అంట..

China’s lotus leaf sun protection viral: ఏదైనా డిఫరెంట్ గా చేయాలంటే చైనీస్ తర్వాత ఎవరైనా. అలా ఉంటాయ్ వారి అలవాట్లు, అభిరుచులు. తాజాగా ఇద్దరు చైనీస్ అమ్మాయిలు చర్మ సంరక్షణ కోసం తీసుకున్న చర్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు సన్‌స్క్రీన్‌కు బదులుగా తామర ఆకులుతో ముఖాలను కప్పుకుని బైక్‌ డ్రైవ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది కాస్త నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. సన్‌స్క్రీన్‌కు బదులుగా తామర ఆకులను ఉపయోగించవచ్చా అనేది అందరిలోనూ మెదిలితున్న ప్రశ్న.

- Advertisement -

ఏదైనా క్రేజీ పని చేయాలన్నా, టెక్నాలజీ వాడాలన్న చైనీయులు ముందే ఉంటారు. ఎండ నుంచి రక్షించుకోవటానికి సిచువాన్ లోని ఇద్దరు యువతులు మెుదలుపెట్టిన ఈ తామర ఆకుల ట్రెండ్ కు సోషల్ మీడియా షాక్ అవుతోంది. వారి సృజనాత్మకతకు సలాం కొడుతోంది. తామర ఆకుల్లోని చర్మాన్ని చల్లబరిచే గుణాలు సూర్యుడి కాంతి నుండి మనల్ని రక్షిస్తాయని కొంత మంది అంటుంటే.. అతినీలలోహిత కిరణాలు నుండి అవి రక్షించలేవని మరికొంత మంది అంటున్నారు. తామరను ఎక్కువగా సౌందర్య సాధనాల్లో వాడతారు. అంతేకుకుండా దీని లక్షణాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని ఓ నివేదిక తెలిపింది.

ఈ ఇద్దరు మహిళలు ప్రారంభించిన ఈ తామర ఆకుల ట్రెండ్ చాలా ప్రదేశాలకు పాకింది. ముఖ్యంగా యువత ఈ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. అయితే ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా చైనీయుల ఈ క్రేజీ అలవాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News