Holi Cow Harassment Video: హోలీ వేడుకల సందర్భంగా హర్యానాలో కొందరు దుండగులు ఒక ఆవుకు బలవంతంగా మద్యం తాగించిన సంఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా ఆ ఆవుతో బండిని లాగించిన అమానవీయ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హర్యానాలో హోలీ వేడుకల వేళ జంతు హింసకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో కొందరు యువకులు ఆవు నోరు బలవంతంగా తెరిచి బలవంతంగా మద్యం తాగించిన సంఘటన చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆవు పరిస్థితి చూసి దుండగులు నవ్వుతూ వీడియోలు తీశారు.
మద్యం తాగించడమే కాకుండా, ఆ ఆవుతో విపరీతమైన బరువు ఉన్న బండిని లాగించారు. అంతేకాకుండా దుండగులు బండిపై కూర్చుని అరుస్తూ వికృతంగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పండుగ పేరుతో నోరు లేని మూగజీవాల పట్ల ఇలాంటి క్రూరత్వానికి పాల్పడటం సరికాదని మండిపడుతున్నారు.
Haryana Holi video Shows Men Pouring Alcohol into Cow's Mouth . pic.twitter.com/oOShyxLTKn
— In Trending (@InTrending_) March 3, 2026
ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, జంతు సంరక్షణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కోరుతూ భారీ ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.

