Viral News in Telugu: ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ అని తేడా లేకుండా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు కింద స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూడటం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. సహచరులను కూడా చూడకుండా పై స్థాయిలో ఉన్నాం కదాని ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేల్స్ హెడ్ ఒకామె తన తోటి ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన HDFC బ్యాంకు ఉద్యోగుల సమావేశం రీసెంట్ గా జరిగింది. అందులో బ్యాంక్ సేల్స్ హెడ్ ఒకామె తోటి ఉద్యోగులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించింది. ”వచ్చినాం పోయినాం అంటూ కాకుండా ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేయాలని.. 90 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఊరుకునేది లేదని” ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. అడిగిన వాళ్లను మీరు చేస్తే చేయండి లేదా దిక్కున్న చోట చెప్పుకోండి.. నాకు నంబర్స్ కావాలంటూ గట్టిగా అరిచింది. ఈమె ప్రవర్తనకు అక్కడ ఉన్నవారంతా మారు సమాధానం చెప్పలేక ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ వీడియోను కిషన్ కుమార్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. తోటి ఉద్యోగులని చూడకుండా వేధింపులకు గురిచేయడం.. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది సేల్స్ హెడ్ తీరును తప్పుబడుతున్నారు. ఒక సీనియర్‌గా చిన్న ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాలని.. టార్గెట్స్ పేరుతో వేధించకూడదని హితవు పలుకుతున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ప్రాణాలను లెక్కచేయకుండా.. చదువు కోసం చిన్నారుల సాహసం.. గుండె తరుక్కుపోయే వీడియో.. – Telugu Prabha Telugu Daily