Insta Reel Saves Life Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం పబ్లిక్ ప్లేసుల్లో కొందరు రీల్స్ చేయడాన్ని మనం సాధారణంగా తప్పు పడుతుంటాం. జనాలకి ఇబ్బంది కలిగించేలా ఏంటీ పనులు.. లైక్స్, వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా అంటూ విమర్శిస్తాం. అయితే ఇక్కడ మాత్రం అలా అనుకోవడానికి వీల్లేదు. రైల్వే స్టేషల్‌లో కదులుతున్న రైలు నుంచి ఓ కుర్రాడు చేసిన రీల్.. ఓ వృద్ధుడి ప్రాణాలను కాపాడింది. అదెలా అంటారా..
Also Read: https://teluguprabha.net/viral/btech-student-spot-died-while-doing-bike-stunt/
రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు కదులుతుండగా దాని పక్కనే ప్లాట్‌ఫామ్ మీద నుంచుని ఓ కుర్రాడు డాన్స్ రీల్ చేస్తున్నాడు. తన స్నేహితులు ఆ డాన్స్ రికార్డు చేస్తున్నారు. ఓ ఫేమస్ పాటకు ఫుల్ జోష్ స్టెప్స్ వేస్తున్నాడు. పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేయడం తప్పు.. కానీ ఇక్కడ అదే తప్పు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. యువకుడు డాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా ఓ సంఘటన జరిగింది.
స్టేషన్‌లో రైలు కదులుతుండగా దిగబోతున్న ఓ వృద్ధుడు ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయాడు. వెంటనే రీల్ చేస్తున్న కుర్రాడు.. అప్రమత్తమై వృద్ధుడిని గట్టిగా పడుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/viral/man-harasses-girl-her-friends-fake-robbery-for-mobile/
ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఒక్కోసారి రీల్ చేయడం కూడా మంచిదే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమయస్ఫూర్తితో వృద్ధుడిని కాపాడిన కుర్రాడిని అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీల్ మోజులో పడి హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన సైతం తాజాగా చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై బైక్‌తో స్టంట్ చేస్తుండగా.. కంట్రోల్ తప్పి బైక్ కిందపడటంతో పాటు నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
रिल बनाना कभी कभी सही भी होता है 👇👇
एक युवक प्लेटफॉर्म पर डांस की रिल बना रहा था तभी अचानक एक बुजुर्ग चलती रेलगाड़ी से उतरने की कोशिश करता है और गिर जाता था तभी युवक उसको सही सलामत उतार लेता है 😳😳 pic.twitter.com/ElODY0vcba
— Guru Choudhary (@guru_choudhary0) October 25, 2025


