Saturday, November 15, 2025
HomeTop StoriesKabali Elephant: హైవేను దిగ్బంధించిన 'కబాలి' ఏనుగు.. 18 గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో

Kabali Elephant: హైవేను దిగ్బంధించిన ‘కబాలి’ ఏనుగు.. 18 గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో

Kabali Elephant Highway Block: ‘కబాలి’ ఏనుగు.. ఇప్పటివరకూ ఈ ఏనుగు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓ సారి అంబులెన్స్‌ను అడ్డుకున్న ఈ గజరాజు.. మరోసారి బైకర్‌ను గాయపర్చింది. కొన్నేళ్ల క్రితం ఓ జీప్‌పై కూడా దాడి చేసింది. తాజాగా ఓ హైవేను దిగ్బంధించి దాదాపు 18 గంటలపాటు వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ‘కబాలి’ ఏనుగు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అతిరప్పిల్లి-మలక్కప్పర అంతర్రాష్ట్ర రహదారిపైకి చేరుకుంది. రోడ్డుకు అడ్డంగా ఓ చెట్టును పడేసి దానిని తింటూ ఉంది. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఇరువైపులా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దాదాపు 18 గంటలపాటు ఏనుగు అక్కడి నుంచి కదలలేదు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ క్రమంలో వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులు, టూరిస్టులు.. ఆహారం, కనీసం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Also Read: https://teluguprabha.net/viral/teen-reel-on-railway-track-train-hit-spot-died/

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని.. ఆ ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే సిబ్బందిపై కబాలి దాడి చేయడంతో తృటిలో వారు తప్పించుకున్నారు. చివరకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ ఏనుగు రోడ్డును విడిచి అడవిలోకి ప్రవేశించింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెల్లగా వాహనాలు అక్కడి నుంచి కదిలాయి. కాగా, దాని ప్రవర్తనతో ప్రసిద్ధి చెందిన ఈ గజరాజుకు 2016లో రిలీజ్‌ అయిన రజనీకాంత్ చిత్రం ‘కబాలి’ పేరును ఈ ఏనుగుకు పెట్టారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad