Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: వీధిలో కారు బీభత్సం.. తృటిలో తప్పించుకున్న బాలుడు.. కారు నడిపింది ఎవరో తెలుసా?

Viral Video: వీధిలో కారు బీభత్సం.. తృటిలో తప్పించుకున్న బాలుడు.. కారు నడిపింది ఎవరో తెలుసా?

Shocking Incident in Haryana: సోషల్ మీడియాలో రోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కారు వీధుల్లో బీభత్సం సృష్టించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదుపేస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన హర్యనాలో జరిగింది.

- Advertisement -

వీడియోలోకి వెళితే.. ఈ నెల 16న హర్యానాకు చెందిన ఇద్దరు పిల్లలు తమ వీధిలో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్‌యూవీ కారులో ఎక్కి కూర్చుకున్నారు. అంతేకాకుండా తాళం పెట్టిన కారును డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించారు. వారికి నడపడం రాకపోవడంతో.. కారుపై నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న వీధుల్లోకి దూసుకెళ్లారు. తొలుత ప్రమాదకరంగా ఓ మలుపు తిరిగిన కారు..అలానే ముందుకు దూసుకుపోయింది. ఎదురుగా కారు రావడం గమనించిన ఓ బైకర్ రెప్పపాటులో తప్పించుకున్నాడు.

ఆ తర్వాత వీధిలోని పార్క్ చేసిన వాహనాలపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో దాని నుంచి తప్పించుకునేందుకు ఓ పిల్లాడు ఇంట్లోకి పరిగెత్తాడు. కారు మెట్ల పై నుంచి వెళ్లింది. కారు రావడం గమనించిన మిగతా పిల్లలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. చివరకు కారు ఆ వీధి చివర ఒక బైక్ ను ఢీకొని ఆగింది. అప్పుడే కారు నుంచి ఇద్దరు పిల్లలు దిగారు. వారిని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

అయితే కారు నడిపింది ఆ పిల్లలనే స్థానికులు గ్రహించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కొన్ని ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్త తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad