Snake Angry Video Viral: మనిషినైనా, ఎంత పెద్ద జంతువునైనా చంపాలంటే పాము తర్వాత ఎవరైనా. అది ఒక్కకాటుతో మనల్ని కాటికి పంపించేస్తుంది. ఈ భూమ్మీద ఉన్న విషపూరితమైన నాగుల్లో కింగ్ కోబ్రా తొలి స్థానంలో ఉంటుంది. ఇది కాటువేస్తే దీని విషం క్షణాల్లో ప్రాణాలను తీస్తుంది. అలాంటి పాముల వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను చూడాలన్న ఆసక్తి జనాల్లో విపరీతంగా పెరిగింది. పాముల వీడియోలకు వస్తున్న ఆదరణతో వీటికి సంబంధించిన వీడియోలు మరింత అధికంగా పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా అలాంటి ఓ నాగుపాము వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇందులో ఓ నాగుపాము పడగ విప్పి మరీ బుసలు కొడుతోంది. కోపంతో రగిలిపోతున్న ఆ పామును వీడియో తీసున్న వ్యక్తిపై అది దాడికి తెగబడింది. బుసలు కొడుతూ మరీ ఆ వ్యక్తిపై దూసుకెళ్లింది. అతను ఏదో విధంగా తప్పించుకున్నాడు. ఆ స్నేక్ బుసలకు అక్కడున్నవారు భయాందోళన చెందారు. నాగుపాముకు ఇంత కోపం ఉంటుందా అని దానిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. పాముతో పరాచకాలు అవసరమా అని కొందరు కామెంట్ చేస్తుంటే..పాముకు ఇంత కోపం ఉంటుందా అని మరోకరు కామెంట్ చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. అసలే ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. పైగా పాములు కూడా ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాలను తరుచూ శుభ్రం చేసుకోవాలి. చిన్న పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. బెడ్ రూమ్ ల్లోనూ, కిచెన్ ల్లోనూ, బాత్రూమ్ ల్లోనూ ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి.