Poisonous Cobra Snake viral Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాముల వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వాన కాలం నడుస్తోంది. ఈసీజన్ లో అడవుల్లో ఉండాల్సిన ప్రమాదకరమైన పాములు ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడపడితే అక్కడ నక్కి మనుషులు ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఇవి ఎక్కువగా వంట గదిలోనూ, బెడ్ రూమ్ లోనూ, బైక్స్ లోనూ, షూ ల్లోనూ, బాత్రూమ్ ల్లోనూ నక్కే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఓ నల్ల త్రాచు ఓ ఇంట్లోని టాయిలెట్ కమోడ్‌లో దూరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబ సభ్యుల పొరపాటున కూడా బాత్రూమ్ కు వెళ్లి ఉంటే వారి పరిస్థితిని ఆలోచిస్తేనే జాలేస్తోంది.
పామును వీడియో తీస్తున్న కొద్ది అది కమోడ్ లోకి అడుగు వెళ్లడం వీడియోలో గమనించవచ్చు. అది పడగ విప్పి బుసలు కొట్టడం కూడా గమనించవచ్చు. అక్కడున్న వారు ఈ మెుత్తం తతంగాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ లైక్స్ తోపాటు కామెంట్స్ జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇక నుంచి వాష్ రూమ్ కు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఓ వినియోగదారుడు కామెంట్ చేశాడు.
Also Read: Python Video-కిస్ పెట్టబోతే కొరికేసిన కొండచిలువ.. కట్ చేస్తే..!
ఇంటర్నెట్ లో కింగ్ కోబ్రా, పైథాన్ వీడియోలకు ఓ రేంజ్ లో ఆదరణ లభిస్తోంది. సర్పాల వీడియోలు గురించి నెటిజన్స్ ఈ మధ్య నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. ఇందులో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియోలు నెట్టింట ఇట్టే వైరల్ అవుతున్నాయి.


