Snake Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య స్నేక్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజూ కొన్ని వందల వీడియోలు నెట్టింట డంప్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. పాము ఏ చిన్న క్రేజీ పని చేసినా ఆ వీడియోకు నెటిజన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా అలాంటి వీడియోను ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ నాగుపాము తన తోకతో బోరింగ్ కోడుతూ ఓ వ్యక్తి దాహాన్ని తీర్చింది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ వ్యక్తి నీళ్లు కోసం దగ్గరలో ఉన్న బోర్ పంపు దగ్గరకు వస్తాడు. ఇంతలో ఆ పంపును భారీ నాగుపాము చుట్టుకొని ఉంటుంది. అయితే అతడు ఏ మాత్రం భయపడకుండా నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తాడు. ఆ కింగ్ కోబ్రా కూడా అతడికి సహకరిస్తుంది. పడగవిప్పి మరీ నిలబడి తన తోకతో బోరింగ్ కొడుతూ అతడి దాహార్తిని తీరిస్తుంది.
చుట్టుపక్కల ఉన్నవారు ఈ వింతను వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఆ దేవుడి మహిమ అని కొందరంటే.. అసలు పాము బోరింగ్ కొట్టడమేంటనీ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి.
అసలే వర్షాకాలం. ఈ వానలకు తరుచూ పురుగులు, పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా పాము కరిచిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి అంతేకానీ నాటువైద్యం అంటూ ప్రాణాలపైకి తెచ్చుకోకండి. అంతేకాకుండా కేర్ లెస్ గా ఉండటం కూడా మీ ప్రాణాలు పోయేలా చేస్తోంది. మీకు వీలైతే ఏ పాములు డేంజరస్, కుట్టిన వెంటనే ఏం చేయాలి తదితర విషయాలు కోసం నెట్టింట సెర్చ్ చేసి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి.