Leopard standing on two legs: ఈ భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏదైనా ఉందంటే అది చిరుత. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. వీటిలో లెపెర్డ్స్, చీతాలనే రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో చీతాలు 1950ల్లోనే అంతరించిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి లెపెర్డ్స్. అయితే మోదీ సర్కార్ ప్రాజెక్టు టైగర్ లో భాగంగా చిరుతలను విదేశాల నుంచి తెప్పిస్తుంది. ఇప్పటికే నమీబియా, సౌతాఫ్రికాల నుంచి 20 చిరుతలను తెచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. వీటి సంతతి రోజురోజుకు వృద్ధి చెందుతుంది కూడా.
ఇంటర్నెట్ లో ఎక్కడా చూసిన ఈ మధ్య ఈ సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పాముల వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మనం క్రూరమృగాలను నేషనల్ పార్కుల్లోనూ, వైల్డ్ లైఫ్ శాంక్చూయరీల్లోనూ చూస్తాం ఉంటాం. అయితే వీటిని దగ్గరగా చూసేందుకు సఫారీలు నిర్వహిస్తారు టూరిస్టు నిర్వాహకులు. అలా వెళ్లిన టూరిస్టులు జంతువులను వేటాడిన దృశ్యాలను తమ ఫోన్స్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ అరుదైన సంఘటన సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో జరిగింది. ఇక్కడ చీతా చేసిన ఓ పని అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
That leopard is looking at his food by standing on two legs. Leopards are one of the most versatile creatures on earth. From Kruger. pic.twitter.com/tNG74rt9R8
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 12, 2025
కొంత మంది పర్యాటకులు క్రూగర్ నేషనల్ పార్క్ కు జంతువులను చూసేందుకు జీబుల్లో వెళ్లారు. ఇంతలో వారి కళ్ల ముందుకు ఒక చిరుత వచ్చింది. అది వేటడానికి సిద్ధంగా ఉంది. అక్కడికి కొంత దూరంలో గడ్డి వెనుకాల జింక ఉండటం చూసింది. అయితే దాని ముందు దట్టమైన గడ్డి పొదలు ఉండటంతో.. మనిషి నిలబడినట్టే తన రెండు కాళ్ల మీద నిలబడి మరీ తన వేటను గమనిస్తుంది చీతా. అలా కొంతసేపు వీక్షకులకు కనువిందు చేసింది. తర్వాత జింకపై దాడి చేయడానికి వెళ్లింది. ఈ దృశ్యాన్ని టూరిస్టులు తమ ఫోన్ ల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరుత మనిషిలా నిలబడటం చూసి నెటిజన్స్ షాక్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.


