Homeవైరల్Lion Video: ఏటీఏమ్ లోకి దూరి.. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన భారీ సింహం..

Lion Video: ఏటీఏమ్ లోకి దూరి.. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన భారీ సింహం..

Lion attacks on security guard video: రోజూ నెట్టింట కొన్ని వందల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు అయితే భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో యానిమల్స్ వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పాములు, చిరుతలు, సింహాలు, ఏనుగులు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓ సింహం ఏటీఎమ్ లోకి చొరబడి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

ఇటీవల కాలంలో జంతువులు అడవి నుంచి దగ్గరలో ఉన్న జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే అడవికి మృగరాజైన సింహం కూడా ఓ ఊరిలోకి వచ్చింది. అది దగ్గరలో ఉన్న ఏటీఎమ్ సెంటర్ లోకి చొరబడింది. అంతటితో ఆగకుండా అక్కడే నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. చూస్తుండగానే అతడి చేయిని పట్టుకుని ఈడ్చుకెళ్లి అతడిపై క్రూరంగా దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి అతడు చాలా ట్రై చేశాడు. అయితే అంత వరకే సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Doctor Viral Video-పేషెంట్‌ అని చూడకుండా దారుణంగా చితకబాదిన డాక్టర్‌.. వైరల్‌ వీడియో

ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఫారెస్ట్ కు దగ్గరగా ఉండే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అయితే కొంత మంది ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని కొట్టిపారేస్తున్నారు. మరికొందరు ఇది నిజమైన వీడియో అని నమ్ముతున్నారు. అయితే ఏఐ అభివృద్ధి చెందాక ఏది రియలో లేదా ఏది రీలో అర్థం కావడం లేదు. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సెలిబ్రిటీలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News