Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: తల్లి కోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. వైరల్ గా మారిన వీడియో..

Viral Video: తల్లి కోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. వైరల్ గా మారిన వీడియో..

Baby Elephant Emotional video: ఈ సృష్టిలో స్వచ్ఛమైనది ఏదైనా ఉందంటే అది తల్లిప్రేమ మాత్రమే. అలాంటిది నేటి సమాజంలో చాలా మంది అమ్మ ప్రేమకు నోచుకోవడం లేదు. లేచింది మెుదలు పడుకునే వరకు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏదో చుట్టుం చూపులా ఇంటికి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లిపోతున్నారు. ఆధునిక యువత కన్నపేగు బంధం విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంది. కానీ తాజాగా ఓ ఏనుగు పిల్ల తల్లితో విడపోవడంతో తీవ్రంగా తల్లడిల్లపోయింది. ఈ హృదయావిధాకరకర ఘటన అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

వీడియో ఓపెన్ చేస్తే… చోటూ అని పిలువబడే గున్న ఏనుగు దాని తల్లి నుంచి విడిపోయి తప్పిపోతుంది. ఈ క్రమంలో పిల్ల ఏనుగు అటవీ అధికారుల చెంతకు చేరుతుంది. వారు ఎలాగైనా తల్లి బిడ్డలను కలపాలని ప్రయత్నిస్తారు. మెుదట తల్లి ఏనుగు మూత్రాన్ని పిల్ల ఏనుగుపై పూస్తారు. వారు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. మనుషులు తాకిన తన బిడ్డని తల్లి ఏనుగు మళ్లీ స్వీకరించదు. అందుకే ఫారెస్ట్ అధికాకరులు అలా చేశారు. చివరకు ఏదోలా వెతికి తల్లి ఏనుగుతో గున్న ఏనుగును కలుపుతారు. తర్వాత ఏ రెండు ఎంచెక్కా నడుచుకుంటూ అడవిలో వెళ్లిపోతాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో అందరి హృదయాలను కదలించింది. ఈ ఏనుగును చూసి చాలా మంది నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన జంతువుల వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తున్నాయి. యానిమల్స్ లో ఎక్కువగా ఏనుగులు, పులులు, సింహాలు మరియు పాములకు సంబంధించిన వీడియోలనే జనాలు అధికంగా చూస్తున్నారు. జంతువులు డిఫరెంట్ గా ఏం చేసిన అది ఇట్టే వైరల్ అయిపోతుంది. నెటిజన్స్ కూడా అలాంటివి చూడటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad