Thursday, July 10, 2025
Homeవైరల్Viral Video: రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట, వీడియో వైరల్

Viral Video: రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట, వీడియో వైరల్

Lovers romance on running bike: ఈ మధ్య కాలంలో యువతీ యువకుల చేష్టలు హద్దుమీరుతున్నాయి. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై రాత్రిళ్లు రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. రీల్స్ మోజులో పడి పబ్లిక్ ప్లేస్ అన్న సంగతి కూడా మరచిపోయి బరితెగించి తిరుగుతున్నారు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ ప్రేమ జంట బైక్ పై వెళ్తూ రోమాన్స్ లో మునిగితేలారు.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. యూపీలోని ఫిరోజాబాద్ హైవేపై ఒక ప్రేమ జంట రొమాన్స్ తో రెచ్చిపోయింది. అందరూ చూస్తున్నారనే భయం కూడా లేకుండా రన్నింగ్ బైక్ పైన రాసలీలకు దిగారు. ఓవైపు బైక్ నడుపుతూనే.. మరోవైపు యువతిని ట్యాంక్ మీద పడుకోబెట్టి రొమాన్స్ చేశాడు ఆ యువకుడు. ఈ నీచమైన పనిని అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారు చేసిన ఈ దిక్కుమాలిన పనికి తగిన శాస్తి చేయాలని కోరుతున్నారు.

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి. భారీగా ఫైన్స్ వేస్తున్న యువత లెక్క చేయడం లేదు. ఏదో హీరోహీరోయిన్స్ లాగా రోమాన్స్ చేస్తూ పబ్లిక్ ను డిస్టర్బ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఘటనలు ఎక్కువై పోయాయి. రీల్స్ వ్యామోహంలో పడి ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ అభివృద్ది చెందిందని సంతోషపడాలో లేదా ఇలాంటి నీచమైన సంఘటనలు చూడాలని బాధపడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి చట్టాలు తీసుకురావాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News