Friday, January 16, 2026
Homeవైరల్Viral: అన్న ఇంటికి నిప్పు పెట్టడానికి వెళ్లిన తమ్ముడు.. కాసేపటికే ఊహించని షాక్‌.. కట్‌ చేస్తే...

Viral: అన్న ఇంటికి నిప్పు పెట్టడానికి వెళ్లిన తమ్ముడు.. కాసేపటికే ఊహించని షాక్‌.. కట్‌ చేస్తే ఆస్పత్రిలో.!

తోడబుట్టిన వాడి మీద పగతో అతని కుటుంబాన్ని నాశనం చేద్దామని చూసిన తమ్ముడికి తగిన శాస్తి జరిగింది. సోదరుడి ఇంటిని అగ్నికి ఆహుతి చేయాలని చూసి చివరికి అతనే మంటల్లో చిక్కుకున్నాడు. చేసిన పాపానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

వ్యాపారంలో ఎదుర్కొన్న నష్టాలతో అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి ఆస్తిని అమ్మాలని చూసిన తమ్ముడికి అన్న అడ్డు చెప్పాడు. దీంతో తమ్ముడు చేసిన నిర్వాకం ఇప్పుడు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. కర్ణాటకలోని గోవిందపుర గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనే దానికి ఈ ఘటన ఉదాహరణ.. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-key-decisions-5/

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందపురకి చెందిన రామకృష్ణ, మునిరాజు అన్నాతమ్ముళ్లు. గత ఎనిమిదేళ్లుగా మునిరాజు గ్రామంలో చిట్‌ ఫండ్‌ వ్యాపారన్ని నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో గ్రామస్థులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక తమ భూమిలో కొంత భాగాన్ని అమ్మాడు. కొందరికి డబ్బు తిరిగి ఇచ్చేశాడు. అయితే మిగిలిన భూమిని కూడా అమ్మ బకాయిలు తీర్చాలని మునిరాజు భావించాడు. ఇందుకు రామకృష్ణ అంగీకరించలేదు. దీంతో అన్నాతమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తాయి.

భూమిని విక్రయించడానికి ఒప్పుకోకపోవడంతో అన్న మీద పగ పెంచుకున్న తమ్ముడు.. రామకృష్ణ ఇంటిని తగలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో అన్న ఇంటికి చేరుకుని ముందుగా మెయిన్‌ డోర్‌ తలుపు వేశాడు. తర్వాత ఇంటి చుట్టూ డబ్బాతో పెట్రోల్‌ చల్లాడు. అనంతరం నిప్పు అంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే పెట్రోల్‌ చల్లుతున్న క్రమంలో చేతులు, ఒంటిపై ఆయిల్‌ పడటంతో ఆ మంటలు కాస్త మునిరాజుకి అంటుకున్నాయి. దీంతో అతను లబోదిబోమమని కేకలు వేశాడు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/divya-spandana-sarcastic-take-on-stray-dogs-hearing-divides-social-media/

మునిరాజు కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అతడిని రక్షించి పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న మునిరాజుని వెంటనే హోస్కోట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు.. తిరుమలశెట్టిహళ్లి పోలీసులు హత్యాయత్నం ఆరోపణల కింద మునిరాజుపై కేసు నమోదు చేశారు. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News