Homeవైరల్Viral: చీర నచ్చలేదని పెళ్లిని రద్దు చేసిన వధువు!

Viral: చీర నచ్చలేదని పెళ్లిని రద్దు చేసిన వధువు!

Uttar Pradesh: ఇటీవల పెళ్లిపీటల మీద పెళ్లిళ్లు రద్దవుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అబ్బాయి నచ్చలేదని అమ్మాయి, వధువు ఇంటి నుండి మర్యాదలు సరిగాలేవని వరుడు పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. కానీ యూపీలో జరిగిన ఓ పెళ్లి రద్దు అంశం ఇప్పుడు.. నెట్టింట్లా తెగ వైరల్‌ అవుతుంది. అబ్బాయి కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని పెళ్లికూతురు వివాహాన్ని రద్దు చేసుకుంది.

- Advertisement -

చీర నచ్చలేదని పెళ్లి రద్దు: వరుడి కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లాకు చెందిన వరుడు విశాల్‌ గోండ్‌ తరఫున తెచ్చిన చీర తనకు నప్పలేదని వధువు నికీ పెళ్లిని నిరాకరించింది. పెళ్లి పెద్దలు ఎంత బుజ్జగించినా.. పెళ్లికి ససేమిరా అంటూ మొండికేసింది. దీంతో ఇరుకుంటుంబాల మధ్య ఘర్షణకు మొదలైంది. ఈ ఘర్షణలో వరుడి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ నెల 11న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.

పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఇరుకుటుంబాలు: పెళ్లి రద్దు కావడంతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. అయితే వధువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరుడు విశాల్‌తోపాటు అతడి బంధుమిత్రులపై కేసు నమోదైంది. అయితే వరుడి తరపు బంధువులు సైతం.. అమ్మాయి కుటుంబంపై కేసు పెట్టారు. దీంతో చీర అంశం.. పెళ్లిని రద్దు అయ్యేలా చేయడంతో పాటు ఇరు కుటుంబాలను పోలీస్టేషన్‌ వరకు తీసుకెళ్లింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News