Viral Video: ముంబై లాల్‌బాగ్ రాజా గణేశ్ మహరాజ్‌ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వినాయక చవితి సందర్భంగా కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడి గణపతిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సందర్భంగా.. లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం భారీగా భక్తులు క్యూకట్టారు. లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం వేలాది మంది భక్తులు అర్ధరాత్రి నుండి క్యూలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, లాల్‌బాగ్ రాజా వెలుపల 18 కిలోమీటర్ల పొడవైన క్యూ ఏర్పడింది. అక్కడ భారీ జనసమూహం ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా వినాయకుడి చుట్టూ నిలబడి, గోడలకు ఆనుకుని, వీధుల్లో దుప్పట్లు పరిచి నిద్రపోతున్నట్లు కనిపించింది. ఇది భక్తుల భద్రత, జనసమూహ నిర్వహణ సమస్యలను లేవనెత్తుతుంది. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
Read Also: Delhi: కారుతో ఢీకొట్టి.. 600 మీటర్లు ఈడ్చకెళ్లిన ఘటన.. బాలుడు అరెస్టు
తిరుపతి వెంకన్న సన్నిధి థీమ్..
మరోవైపు, ఇది లాల్‌బాగ్ రాజా 92వ గణేష్ మహోత్సవాలు. వినాయక నవరాత్రుల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి తిరుపతి వెంకన్న సన్నిధి థీమ్‌తో లాల్‌బాగ్ గణేషుడిని రూపొందించినట్లు మండల్ ప్రెసిడెంట్ బాలాసాహెబ్ కాంబ్లే చెబుతున్నారు. తిరుపతిలో బంగారువాకిలి థీమ్‌ను తీసుకుని.. ఇక్కడ గణేష్ మహరాజ్‌ను రూపొందించామన్నారు. అయితే ఈసారి ఎలాంటి వీఐపీ పాసులు మంజూరు చేయడంలేదని.. ఎవరైనా సరే భక్తుల క్యూలైన్లోనే రావాలన్నారు నిర్వాహకులు. ఇకపోతే, లాల్‌బాగ్ రాజా అనేది ముంబై సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఆచారం. 1934 నుంచి ఇక్కడ గణపతిని ప్రతిష్టిస్తుండటం వల్ల అత్యంత పురాణ గణేశ్ పూజగా పరిగణిస్తారు.10 రోజుల పాటు జరిగే వేడుకలో రోజూ 1.5 మిలియన్లకు పైగా భక్తులు దర్శించుకోనున్నట్లు సమాచారం.
Read Also: Kangana: బెడ్ షీట్ రక్తంతో నిండిపోయింది.. భయపడ్డా- కంగనా


