King Cobra in kitchen video: పాములంటే మనలో చాలా మందికి భయం. చిన్న పాములను చూస్తేనే దడుచుకునే మనం.. కింగ్ కోబ్రా కంట పడితే ఏమైనా ఉందా ప్యాంట్ తడిచిపోవడమే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పాముల వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఈ వీడియోలను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
సాధారణంగా పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలు అడవుల్లో కనిపిస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు ఇవి ఇళ్లలో సైతం కనబడుతుంటాయి. పైగా వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఏ చిన్న కన్నం ఉన్న అందులో నక్కి దాక్కుని ఉంటాయి. బెడ్ రూమ్ లోకి, కిచెన్ లోకి, బాత్రూమ్ లోకి పాములు హల్ చల్ చేసిన ఘటనలు ఈ మధ్య నెట్టింట చూస్తూనే ఉన్నాం
ఇటీవల భారీ నల్లత్రాచు ఓ ఇంట్లోని కిచెన్ లోకి దూరి కలకలం సృష్టించింది. అది సిలిండర్ వెనకాల దాక్కుని పడగ విప్పి బుసలు కొడుతుంది. ఆ భారీ కింగ్ కోబ్రాను చూసి ఇంట్లోని వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అది చాలా సేపు సిలిండర్ వెనుకాలే దాక్కుని బుసలు కొడుతూ ఉండిపోయింది. దీంతో లాభం లేదనుకుని వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న పాములు పట్టే వ్యక్తి గ్యాస్ సిలిండర్ పక్కకు జరిపి..దాన్ని కష్టపడి ఎంతో చాకచక్యంతో పట్టుకున్నాడు. అది కాటు వేయడానికి ప్రయత్నించినప్పటికీ దాని నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత దానిని తీసుకెళ్లి దగ్గరలోని అడవిలో విడిచిపెట్టాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ఇన్ స్టాలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై కామెంట్స్, లైక్స్ వర్షం కురుస్తుంది.
భూమ్మీద డేంజరస్ స్నేక్స్ ల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఒక్కకాటుతో ఎలాంటి వ్యక్తినైనా చంపేస్తుంది. దీని విషం క్షణాల్లో మనిషిదైనా, జంతువుదైనా ప్రాణం తీసేస్తుంది. ఈ కోబ్రాలు ఎక్కువగా ఆసియా ఖండంలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కింగ్ కోబ్రాలు ఇండోనేషియాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో కూడా ఇవి అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి పచ్చదనం ఎక్కువగా ఉన్నచోట ఉంటాయి.