Wednesday, July 16, 2025
Homeవైరల్Viral: ఇదెక్కడి వింత ఆచారం రా బాబు.. మెుసలిని పెళ్లాడిన మేయర్.. వీడియో వైరల్

Viral: ఇదెక్కడి వింత ఆచారం రా బాబు.. మెుసలిని పెళ్లాడిన మేయర్.. వీడియో వైరల్

Mexican Mayor Marries Female Crocodile: ప్రపంచం మెుత్తం వింతలు, విడ్డూరాలతో నిండిపోయింది. కొన్ని దేశాల్లో ఆచారాలు, సంప్రదాయాలు వెరైటీగా ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన పాతపద్దతులతోనే జీవించే వ్యక్తులు ఇంకా ఉన్నారు. తాజాగా అలాంటి పురాతన సంప్రదాయం పాటిస్తూ వార్తల్లో నిలిచారు మెక్సికో దేశంలోని ఓ మేయర్.

- Advertisement -

సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. హిందూ వివాహ వేడుకలో అయితే వధూవరులకు ఏమైనా దోషాలుంటే చెట్లతోనూ లేదా కుండలతోనూ లేదా మేకల, గాడిదలతోనూ పెళ్లి చేయడం చూస్తుంటాం. అయితే మెక్సికో దేశంలో ఓ పురాతన వింత ఆచారం ఉంది. అది కాస్త ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అక్కడి స్థానిక మేయర్ ఏకంగా ఓ ఆడమెుసలిని పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచాడు. ఆ మకరానికి అందంగా పెళ్లిగౌను వేసి, ముస్తాబు చేసి మరీ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు గత 200 ఏళ్లుగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు.

మెక్సికో శాన్‌పెడ్రోలోని హ్యూమలూలాలో రెండు శతాబ్దాల నాటి వింత ఆచారం ఉంది. ఇక్కడి మగవాళ్లు ఆడమెుసళ్లను పెళ్లి చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురిసి.. పంటలు బాగా పండుతాయని, మత్స్య సంపద బాగుంటుందని వారి నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఈ తంతు నిర్వహిస్తారు.

తాజాగా హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఒక ఆడ మొసలిని ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో మేయర్ మెుసలిని గాఢంగా హత్తుకుని, ముద్దులాడాడు. అయితే ఇది పెళ్లికి ముందు జరిగే ఓ వింత ఆచారం. తర్వాత మేయర్ మరో పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈవింత ఆచారం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. దాంతో ఫస్ట్ నైట్ చేసుకోవా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News