Sunday, November 16, 2025
Homeవైరల్Shocking: ఏడాది పిల్లోడు.. ఏకంగా నాగు పామునే కొరికి చంపాడు..

Shocking: ఏడాది పిల్లోడు.. ఏకంగా నాగు పామునే కొరికి చంపాడు..

- Advertisement -

One-Year-Old Child Bites Cobra in Bihar: మనలో చాలా మంది పాములను చూస్తేనే అమడ దూరం పారిపోతారు. కొంత మందికి పాముల పేర్లు తలుచుకుంటేనే వెన్నులో వెణుకు పడుతుంది. మరి కొంత మంది అయితే సర్పాల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తారు. పామును చంపి మరీ వైద్యులకు దగ్గరకు తీసుకొని వెళ్లే ఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ పిల్లోడు పామును కొరికి కొరికి చంపాడు. బీహార్ లో జరిగిన ఈ షాకింగ్ సంఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది.

అసలేం జరిగిందంటే..

బీహార్ లోని మోహచ్చి బంకట్వా గ్రామానికి చెందిన ఏడాది బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము ఆ పిల్లాడు ఉన్న చోటుకి పాక్కుంటూ వచ్చింది. పామును బొమ్మ అనుకున్నాడో ఏమో కానీ ఆ బుడ్డోడు దాన్ని కొరికి చంపాడు. కాసేపటికే ఆ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చిన్నారి గొంతు వినిపించడం లేదని బయటకు వచ్చి చూసిన తల్లిదండ్రులకు షాక్ తగిలింది. బాబు కింద పడిపోయి ఉండటం, పక్కనే పాము చనిపోయి ఉండటం కనిపించింది.

దీంతో వెంటనే ఆ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో కాసేపటికే బుడ్డోడు లేచి కూర్చొన్నాడు. అంతేకాకుండా తల్లితో ఆడుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. సంవత్సరం పిల్లోడు పామును ఎలా కొరికి చంపాడా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో ఎంచెక్కా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్య నెట్టింట ఎక్కడ చూసిన పాములు వీడియోలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలు, కొండ చెలువలు, అనకొండలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా సర్పాల వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో రోజూ వేలల్లో వీడియోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. అందులో ఏ వీడియోలు అయితే కాస్త డిఫరెంట్ గా ఉంటాయో అవి ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: Viral video వ్యవసాయ మోటారులో భారీ నాగసర్పం.. వీడియో చూస్తే మీ ఒళ్లు జలదరించడం ఖాయం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad